EPAPER

Anderson @ 700: 700 వికెట్ల క్లబ్‌లో అండర్సన్.. తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు..

Anderson @ 700: 700 వికెట్ల క్లబ్‌లో అండర్సన్.. తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు..

James Anderson latest news


James Anderson Becomes First Pace Bowler To Pick 700 Test Wickets: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ చరిత్ర స్రష్టించాడు. టెస్టు క్రికెట్ లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. తనకన్నా ముందు ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) వికెట్లు పడగొట్టారు. అయితే వారిద్దరూ స్పిన్ బౌలర్లు కావడం విశేషం. నిజానికి ఒక ఫాస్ట్ బౌలర్ ఇన్నేళ్లు కెరీర్ ను కొనసాగించడం అసాధారణమైన విషయంగా చెప్పాలి.

ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లకి రకరకాల ఫిట్ నెస్ సమస్యలు వస్తుంటాయి. మహ్మద్ షమీలాంటి వాళ్లు చీలమండకి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇలాంటివే ఎన్నో ఉంటాయి. అందువల్ల ఒక ఫాస్ట్ బౌలర్ పదేళ్లు కెరీర్ కొనసాగించాడంటేనే గ్రేట్ అని చెప్పాలి.


అలాంటిది 21 సంవత్సరాలు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకి తన సేవలు అందించాడు. 20 ఏళ్ల వయసులో 2003లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆండర్సన్ ఇప్పటివరకు అలుపెరగకుండా ఆడుతూనే ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టుకి తన విలువైన సేవలు అందించాడు. ప్రధాన పేసర్ గా ఉన్నాడు. ఇంతవరకు ఆండర్సన్ 187 టెస్టు మ్యాచ్ లు ఆడి 700 వికెట్లు తీసుకున్నాడు.

Read more: సచిన్ రికార్డుని సమం చేసిన రోహిత్ శర్మ..

నిజానికి తను 699 వికెట్ల వద్ద ఉన్నప్పుడు టీమ్ ఇండియాలో చివరి రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. తను 700 వికెట్ల క్లబ్ చేరకుండానే తిరిగి ఇంగ్లాండ్ ఫ్లయిట్ ఎక్కేస్తాడేమోనని అంతా అనుకున్నారు. కానీ కులదీప్ యాదవ్.. ఆ అవకాశం ఇవ్వలేదు. తన వికెట్టుని అండర్సన్ కి గిఫ్ట్ గా ఇచ్చి 700 వికెట్ల క్లబ్ లోకి క్షేమంగా తీసుకెళ్లాడు.

అత్యధిక వికెట్లు తీసిన వారు అండర్సన్ తర్వాత అనిల్ కుంబ్లే (617), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్ గ్రాత్ (563), వాల్ష్ (519), నాథన్ లయన్ (527) రవిచంద్రన్ అశ్విన్ (511) ఇద్దరూ ఆడుతున్నారు.

ఇంగ్లాండు జట్టు ఓడిపోయి ఉండవచ్చు గానీ, వాళ్లు కూడా ఇండియాకి గట్టిపోటీ ఇచ్చారనే చెప్పాలి. ఈ సిరీస్ లో ఇంగ్లాండు జట్టులో టామ్ హార్ట్ లీ (20) జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. షోయబ్ బషీర్ (12) ఇద్దరూ కూడా ఇండియా సిరీస్ లోనే ఆరంగేట్రం చేశారు. రేపటి ఇంగ్లాండు జట్టుకి విలువైన బౌలర్లుగా మారనున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×