EPAPER

David Warner : జై శ్రీరామ్ ఇండియా.. డేవిడ్ వార్నర్ పోస్ట్ వైరల్..!

David Warner : జై శ్రీరామ్ ఇండియా.. డేవిడ్ వార్నర్ పోస్ట్ వైరల్..!
David Warner

David Warner : ఇండియా అంటే ఎంతో అభిమానం చూపించే ఆస్ట్రేలియా తాజా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠపై స్పందించాడు. తన ఇన్ స్టాలో శ్రీరాముడి ఫొటో పెట్టి… జై శ్రీరామ్ ఇండియా అంటూ పోస్ట్ చేశాడు. ఇదిప్పుడు వైరల్ గా మారింది. 12 లక్షలకుపైగా లైకులు రావడం విశేషం. తనని ఇండియన్స్ అందరూ డేవిడ్ భయ్ అని పిలుస్తూ ఉంటారు.


ఐపీఎల్ మ్యాచ్ ల కోసం వచ్చి, ఇక్కడ పలు ప్రాంతాలు తిరిగే వార్నర్ కి ఇండియా అంటే చాలా ఇష్టమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇండియాలో జరిగే ప్రతీ సంఘటనలోనూ తను ప్రతిస్పందిస్తుంటాడు. ఇక మ్యాచ్ లో సెంచరీ కొట్టాడంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా చేసే మేనరిజమ్, క్రికెట్ ప్రపంచంలో నే హైలెట్ అని చెప్పాలి. బహుశా ఎక్కడో ఒక దగ్గర పుష్ప చూసి ఉంటాడు. ఆ సినిమాకి, అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ కి బాగా కనెక్ట్ అయిపోయాడు.

ఇటీవల చెన్నైకి వచ్చిన మిగ్ జాం తుఫాను నేపథ్యంలో తన అభిమానులకు ఒక పోస్ట్ పెట్టాడు. వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోమని కోరాడు. జలదిగ్భందలో చిక్కుకున్న చెన్నై నగరంలో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని సూచించాడు. అంతేకాదు ఎవరైనా సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే, తప్పకుండా ఆదుకోమని కోరాడు. దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు స్పందించారు.


ఇప్పుడు అయోధ్యలో బాలరాముడి విగ్రహప్రతిష్ఠాపనా మహోత్సవానికి తన శుభాకాంక్షలు తెలిపాడు. ఇంతమంది క్రికెటర్లు వస్తుంటారు, వెళుతుంటారు. వీరిలో చాలామంది ఐపీఎల్ ఆడుతున్నారు. కానీ డేవిడ్ వార్నర్ లా స్పందించే మంచి మనసున్నవారు ఉండటం అరుదు అని చెప్పాలి. భారతీయులందరూ డేవిడ్ వార్నర్ ని తమవాడిగానే చూడటం మొదలైంది.

దీంతో చాలామంది అభిమానులు తన పోస్ట్ కింద రిప్లై లు పెడుతున్నారు. ఎలాగూ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశావు కదా డేవిడ్ భయ్… ఇండియాకు వచ్చి సెటిల్ అయిపోమని అడుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం … ఆధార్ కార్డు అప్లయ్ చేస్కొని, ఇక్కడే ఉండిపొమ్మని అభిమానంతో పిలుస్తున్నారు.

ఓ నెటిజన్ అయితే డేవిడ్ వార్నర్ కాదు ద్రవిడ్ వార్నర్ అంటూ కామెంట్ చేశాడు. మాకు శుభాకాంక్షలు చెప్పినందుకు థాంక్యూ వార్నర్ భాయ్ అని తెలిపాడు. ఇదండీ మన డేవిడ్ భయ్ సంగతులు…రాబోవు రోజుల్లో మరిన్ని తెలుసుకుందాం. ఎలాగూ ఐపీఎల్ కి వస్తాడు కదా…అని కొందరంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×