EPAPER

Ishan Kishan: కుర్రాడికి తత్వం బోధపడినట్టుంది.. ఇషాన్ పై నెట్టింట సెటైర్లు

Ishan Kishan: కుర్రాడికి తత్వం బోధపడినట్టుంది.. ఇషాన్ పై నెట్టింట సెటైర్లు

Ishan Kishan reveals why he rejected BCCI order to play Ranji Trophy: అనుభవమైతేగానీ తత్వం బోధపడదని అంటారు. ఇప్పుడదే పరిస్థితుల్లో ఇషాన్ కిషాన్ ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ఎందుకు ఇషాన్ మళ్లీ తెరపైకి వచ్చాడంటే, తనంతట తాను స్పందించాడు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్నెవరూ అర్ధం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


అంతర్జాతీయ టీ 20లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అనూహ్యంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇప్పటికి బ్లూ జెర్సీ వేసుకుని ఆరునెలలైంది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్థాంతంరంగా స్వదేశానికి వచ్చేయడం, ఆ పై సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం ఇవన్నీ ఇషాన్ కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టేశాయి.

వీటన్నింటికి తోడు తన ఆట తీరు మార్చుకోలేక అవస్థలు పడ్డాడు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ఎన్నో అవకాశాలిచ్చారు. అప్పటికి ఆటతీరు సరిగా లేకపోతే రంజీలు ఆడమని సలహా ఇచ్చారు. దానిని అతిక్రమించి ఐపీఎల్ కి ప్రిపేర్ అయ్యాడు. దీంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు.


అయితే తనతోపాటు ఎదురుతిరిగిన శ్రేయాస్ మళ్లీ తెలివి తెచ్చుకుని రంజీ ఆడాడు. కానీ ఇషాన్ ఒంటరివాడై పోయాడు. అయితే ఐపీఎల్ 2024 లో ముంబయి తరఫున 14 మ్యాచ్ లు ఆడి 340 పరుగులు చేశాడు. కొంచెం ఫర్వాలేదనిపించాడు. కానీ మ్యాచ్ లను ఒక్కడే గెలిపించే స్థాయిలో ఆడలేదు.

అంతర్జాతీయ కెరీర్ లో మాత్రం 27 వన్డేలు ఆడి 933 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలున్నాయి. 32 టీ 20లు ఆడి 796 పరుగులు చేశాడు. 2 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 78 పరుగులు చేశాడు. వన్డేల్లో అయితే స్ట్రయిక్ రేట్ 42.40 ఉంటే, టీ 20ల్లో 25.70 ఉంది.

ప్రస్తుతం టీమ్ ఇండియా యువకులతో కూడిన జట్టుతో జింబాబ్వే వెళ్లింది. అక్కడ కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అంతమంది లైమ్ లైట్ లోకి వస్తుండటంతో ఇషాన్ లో ఆందోళన మొదలైనట్టుంది అంటున్నారు. అందుకే తన మనసులో మాటలను బయటపెట్టాడని చెబుతున్నారు.

Also Read: అభి‘షేక్’ .. తొలి భారత క్రికెటర్ గా చరిత్ర

ఇంతకీ తనేమన్నాడంటే.. నాకు ప్రయాణ అలసట అనే సమస్య ఉంది. అందువల్ల మానసికంగా ఇబ్బంది పడ్డానని అన్నాడు. ఇక లాభం లేదనుకుని కొన్ని రోజులు క్రికెట్ కి బ్రేక్ ఇచ్చానని అన్నాడు. దురద్రష్టవశాత్తూ తన పరిస్థితిని కుటుంబసభ్యులు, కొందరు స్నేహితులు మినహా ఎవరూ అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడంతా సెట్ అయిందని అన్నాడు. భవిష్యత్ పై ఆందోళన లేదు. మళ్లీ టీమ్ ఇండియాలోకి వస్తాను.. మూడు ఫార్మాట్లలో ఆడతాననే నమ్మకం ఉందని అన్నాడు.

అయితే ఇప్పుడు టీమ్ ఇండియాలో కీపర్ కమ్ బ్యాటర్లు చాలామంది లైనులో ఉన్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్  టాప్ లో ఉన్నాడు. ధోనీలా భావి టీమ్ ఇండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. తర్వాత స్టాండ్ పైగా ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్, జితేష్ శర్మ, అభిషేక్ పొరెల్ వీరందరూ క్యూ లో ఉన్నారు. ఇప్పుడు వీరిని దాటుకుని ఇషాన్ రాగలడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన కెరీర్ రికార్డ్స్, అనుభవం వీటివల్ల వస్తే ఒకట్రెండు అవకాశాలు వస్తే రావచ్చునని అంటున్నారు. మరి చూడాల్సిందే.

Related News

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

×