EPAPER

KL Rahul: అయ్యో.. అప్పుడే రాహుల్ రిటైర్మెంట్ ఇచ్చాడా?

KL Rahul: అయ్యో.. అప్పుడే రాహుల్ రిటైర్మెంట్ ఇచ్చాడా?

KL Rahul Retirement News Viral in Social Media: సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత…సెలబ్రిటీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని సీనియర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఏదో భావోద్వేగంలో పొరపాటున చిన్న కామెంట్ చేసినా అది గోరంతలు, కొండంతలుగా మారి కళ్లు మూసి తెరిచేలోగా భూగోళమంతా తిరిగొచ్చేస్తోంది. సోషల్ మీడియా అంత ఫాస్ట్ గా ఉంది.


ఇంతకీ విషయం ఏమిటంటే, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తను పెట్టాడా? లేదా? అనేది తెలీదు. కానీ తను పెట్టిన రిటైర్మెంట్ నోట్ ను ఒక యూజర్ యథాతథంగా స్క్రీన్ షాట్ తీశాడు. దానిని అతను షేర్ చేశాడు. తీరా అది వైరల్ అయ్యేసరికి, కేఎల్ రాహుల్ అకౌంట్ లో ఆ పోస్ట్ లేదు. ఎవరో ఇది ఆకతాయిలు చేసిన పని అని కేఎల్ అభిమానులు అంటున్నారు.

కేఎల్ రాహుల్ గత రెండేళ్లుగా అటు జాతీయ జట్టులో, ఇటు ఐపీఎల్ లో కూడా పెద్దగా ఆడటం లేదు. అంటే ఫామ్ లో లేడనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ఇంక ఆటపై విసుగు చెంది రిటైర్మెంట్ గానీ ప్రకటించాడా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. లేదంటే కొంపదీసి బంగ్లాదేశ్ టెస్ట్ జట్టులో రాహుల్ ని తీసుకోలేదా? అని కూడా అంటున్నారు. అందువల్లే మనస్థాపంతో ఇలా మెసేజ్ పెట్టాడా? అంటున్నారు.


Also Read: టీమిండియా ఆటగాడు శిఖర్‌ధావన్.. రిటైర్‌మెంట్ ప్రకటన.. కాకపోతే

ఇంతకీ అందులో ఉన్న రాహుల్ రిటైర్మెంట్ సారాంశం ఏమిటంటే.. “నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అందరితో చర్చించి నా నిర్ణయం ప్రకటిస్తున్నాను. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఇక రిటైర్ కాబోతున్నాను. నా జీవితంలో కొన్నేళ్ల పాటు క్రికెట్ ఒక భాగమైపోయింది. ఇంతవరకు నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు. మైదానంలో ఇవతల, అవతల ఎన్నో అనుభవాలున్నాయి.

దేశం కోసం ఆడటమనేది ఎప్పుడూ గర్వపడే అంశమే. ఆ అదృష్టం నాకు దక్కింది. వ్యక్తిగతంగా ఎంతోమంది గొప్ప క్రికెటర్లతో ఆడే అవకాశం కలిగింది. కొత్త జీవితం కోసం ఆసక్తిగా చూస్తున్నాను..” అంటూ ముగించాడు. మరి ఇదెంత నిజమో తెలీదు. లేదా తను నోరు విప్పుతాడో లేదో తెలీదు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×