EPAPER

Kavya Maran Crying after SRH’s Lost: ఇది కార్పొరేట్ స్ట్రాటజీనా..? కావ్య పాప అందుకే ఏడ్చిందా..?

Kavya Maran Crying after SRH’s Lost: ఇది కార్పొరేట్ స్ట్రాటజీనా..? కావ్య పాప అందుకే ఏడ్చిందా..?

Kavya Maran Crying After SRH’s Lost in IPL 2024 Final against KKR: హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఆమె వెంట ఉన్నారు. అనుక్షణం తన ప్రోత్సాహాన్ని అందించారు. ప్రతి క్షణం జట్టులో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి గెలుపులో, ఓటమిలో వెంట ఉండి నడిచారు. అలాంటి స్ఫూర్తిదాయక వనిత  మరెవరో కాదు. ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్..


కోల్ కతా తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఒకొక్క వికెట్టు పడిపోతుంటే, కన్నీరుమున్నీరయ్యారు. ఒక వికెట్ పడితే చాలు.. కెమెరామేన్ ఆమైపైనే ఫోకస్ పెట్టేసరికి
తను కెమెరా కంటపడకుండా కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేశారు. ఎంత చేసినా కెమెరా కళ్లను దాటి వెళ్లలేకపోయారు.

మొత్తానికి ఫైనల్స్ లో తమ జట్టు ఓటమిని కావ్య మారన్ తట్టుకోలేకపోయారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాకపోతే ఇక్కడే మరొక అంశం. అందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇదంతా నిజమేనా అంటున్నారు. అదేమిటంటే..


Also Read: ఆ నిర్ణయమే మాకు వరమైంది: శ్రేయాస్

కావ్య మారన్ చేసినదంతా కార్పొరేట్ స్ట్రాటజీలో ఒక భాగమని ప్రముఖ సైకాలజిస్టులు అంటున్నారు. ముఖ్యంగా ఫ్రాంచైజీ ఓనర్ స్టాండ్స్ లో ఉంటే, వారికోసమైనా మరింత కష్టపడి ఆడాలనే భావన ఆటగాళ్లలో కలిగించడం కూడా ఇందులో ఒక భాగమని అంటున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులున్న కావ్య పాప.. తమ జట్టు ఓడిపోతుందంటే.. కన్నీళ్లు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ తమ జట్టు చేరడమే గొప్ప విషయమని అంటున్నారు.

నిజానికి ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ప్రైజ్ మనీ రూ.40 కోట్లు వస్తుంది. ఆ రూ.40 కోట్లు పోతుందని కావ్య పాప ఏడుస్తుందా? అని అందరూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఒక్క కమిన్స్ కోసమే రూ.20 కోట్లు పైనే ఖర్చుపెట్టిన జట్టు.. రూ.40 కోట్ల ప్రైజ్ మనీ పోతుందని ఎవరన్నా ఏడుస్తారా? అంతా డ్రామా కాకపోతే అంటున్నారు.

Also Read: Kavya Maran addresses SRH players: డ్రెస్సింగ్ రూమ్‌లో కావ్యమారన్, కేవలం నాలుగు మాటలు..

ఇదంతా ఎందుకు బయటకి వచ్చిందంటే లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సరాసరి వెళ్లి కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ఇష్టం వచ్చినట్టు పబ్లిగ్గా తిట్టిపోశాడు. దాంతో వళ్లు మండిన మాజీ ప్రముఖ ఆటగాడు సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. ఓడినా నీకు రూ.400 కోట్లు ఫ్రాంచైజీకి ఆదాయం వస్తుంది కదా.. ఇంకెందుకు? ఓవర్ యాక్షన్ అన్నాడు.

అప్పుడర్థమైంది అందరికీ.. ఫ్రాంచైజీ ఓనర్లందరూ ప్రయాసపడేది ప్రైజ్ మనీ కోసం కాదు.. ఓడినా, ఆఖరి స్థానంలో ఉన్న ప్రతీ ఫ్రాంచైజీకి ఏడాదికి రూ.400 కోట్లు పైనే వస్తుంది. కాకపోతే ఇంకా కావాలి. ఆ ఇంకా కావాలంటే  ఫ్రాంచైజీకి బ్రాండ్ వాల్యూ రావాలి. అలా వస్తే జెర్సీల మీద, ఇంకా రకరకాల మార్గాల్లో, అలాగే తమ సంస్థలకు ఫ్రీ పబ్లిసిటీల మీద, ఇలా తమ జట్టు మీద ప్రైవేటుగా వందల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఆ బ్రాండ్ వాల్యూ రావాలంటే.. ఏదొక మ్యాజిక్ జరగాలి. అంటే వరుసగా ట్రోఫీలైనా గెలవాలి. లేదా విరాట్ లాంటి బ్రాండెడ్ ఆటగాళ్లయినా ఉండాలి.

Also Read: KKR vs SRH IPL 2024 Final Match: ఐపీఎల్ చరిత్రలో..14 ఏళ్ల రికార్డ్ బద్దలైంది

ప్రస్తుతం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, చెన్నయ్ సూపర్ కింగ్స్ కి మాత్రమే బ్రాండ్ వ్యాల్యూ ఉంది. వాటి స్థానంలోకి మిగిలిన జట్లు రావాలని.. ఫ్రాంచైజీ ఓనర్లుగా కావ్యా మారన్ ఎమోషనల్ ని ఎంచుకుని, హైదరాబాద్ కి ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తున్నారని అంటున్నారు. మరి ఇది నిజమేనంటారా?

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×