Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 ) టోర్నమెంట్ కు గాను… నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా వేలం నేపథ్యంలో… అక్టోబర్ 31వ తేదీ లోపు.. అంటే రేపటి లోపు… 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును ప్రకటించాల్సి ఉంటుంది. ఈ లిస్టు ను మొదటగా బీసీసీఐకి… అందజేసిన తర్వాత బహిర్గతం చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల లిస్టును ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: IPL 2025 Retentions: 10 జట్ల రిటెన్షన్ లిస్ట్ ఇదే…రోహిత్ , రాహుల్ కు అవుట్..ధోనికి బంపర్ ఆఫర్ ?
దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ జట్టును వీడుతున్నాడని కూడా వార్తలు… రావడం జరుగుతుంది. అదే సమయంలో లక్నో జట్టు కెప్టెన్… కేఎల్ రాహుల్ కూడా బయటకు వెళ్లేందుకు రెడీ అయ్యారట. ఆ జట్టు ఓనర్ ఎంత బదిలాడినా కూడా కేఎల్ రాహుల్… బయటకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటు మహేంద్ర సింగ్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ పోషించనున్నారు. రోహిత్ శర్మకు మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
Also Read: IND VS NZ: 3వ టెస్ట్ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్ ?
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే… ఈసారి హెడ్ కు కెప్టెన్సీ ఇచ్చేందుకు కావ్య పాపా నిర్ణయం తీసుకున్నారట. పంజాబ్ కింగ్స్ జట్టు కు కొత్త కెప్టెన్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేలంలో టీమిండియా జట్టు నుంచి వచ్చే వ్యక్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ లో పెద్దగా మార్పులు ఏమి ఉండవు. అయితే… గుజరాత్ టైటాన్స్ జట్టులో మాత్రం భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Also Read: VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ కు ఆ జట్టు యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిందట. వేలంలో అతన్ని వదిలివేయాలని… నిర్ణయం తీసుకుందట గుజరాత్ టైటాన్స్ జట్టు ( Gujarat Titans ). వరుసగా గాయాలతో మహమ్మద్ షమీ బాధపడుతున్న నేపథ్యంలో…గుజరాత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… శుభమన్ గిల్ కు భారీగా డబ్బు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందట గుజరాత్ టైటాన్స్.
ఇది ఇలా ఉండగా… టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ శమీ… గత కొన్ని రోజులుగా జట్టుకు కూడా దూరంగా ఉంటున్నాడు. వరల్డ్ కప్ తర్వాత గాయపడిన… మహమ్మద్ షమీ… మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా టూర్కు అయిన సెలెక్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో మహమ్మద్ షమీని బీసీసీఐ పాలకమండలి సెలెక్ట్ చేయలేదు.