EPAPER

Rohit Sharma: నువ్వొస్తానంటే.. మేం వద్దంటామా?: రోహిత్ కోసం ఫ్రాంచైజీల క్యూ!

Rohit Sharma: నువ్వొస్తానంటే.. మేం వద్దంటామా?: రోహిత్ కోసం ఫ్రాంచైజీల క్యూ!

Rohit Sharma: ప్రపంచంలోనే ఖరీదైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు విలువైన ఆటగాళ్ల వేటలో పడ్డాయి. కొన్నయితే ఏకంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం క్యాష్ బ్యాగ్ లతో రెడీగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ బయటకు రావడం ఫిక్స్ అని అంటున్నారు.


ఎందుకంటే తనుండగానే, హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ముంబై తెచ్చుకుంది. అది కూడా హార్దిక్ పాండ్యాకి రూ.100 కోట్లు బంపరాఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంత డబ్బుకి టెంప్ట్ అయిన హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా జట్టులోకి వచ్చాడు. రోహిత్ అభిమానులు గాలి తీసేస్తుంటే, పడరాని పాట్లు పడ్డాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు. అలా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ అట్టడుగు స్థానానికి వెళ్లిపోయింది.

ఈ పరిస్థితుల్లో మనసు విరిగిపోయిన రోహిత్ శర్మ ముంబై నుంచి బయటకి వచ్చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో తనని వల వేసి పట్టుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 కోట్ల క్యాష్ బ్యాగ్ లతో రెడీగా ఉన్నట్టు సమాచారం.


Also Read: బాబర్ పై బ్యాట్ విసిరిన రిజ్వాన్ : డబుల్ సెంచరీ మిస్ అయినందుకేనా?

మరోవైపు ఆర్సీబీకి విరాట్ కొహ్లీ కెప్టెన్ గా ఉండేందుకు అంగీకరించడం లేదని సమాచారం. అందువల్ల వారు కూడా రోహిత్ వైపే చూస్తున్నట్టు తెలిసింది. ఇంకా పంజాబ్ కింగ్స్ నుంచి ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతిజింతా కూడా రోహిత్ వస్తానంటే, సర్వస్వం ఇచ్చేస్తానని తెలిపింది. ఇక రోహిత్ వస్తానంటే.. మేం వద్దంటామా..? అని హైదరాబాద్ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ కూడా ప్రకటించారు.

ఇలా ఇండియన్ కెప్టెన్ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీలు పడుతున్నాయి. మరో వైపు ఇంత డిమాండ్ ఉన్న రోహిత్ శర్మను అనవసరంగా వదులుకున్నామని ముంబై ఇండియన్స్ తెగ వర్రీ అయిపోతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ ని బుజ్జగించి, తిరిగి తనకే కెప్టెన్సీ ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో ఐపీఎల్ మెగా వేలంలో చూడాల్సిందే.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×