EPAPER
Kirrak Couples Episode 1

IPL:- డొమెస్టిక్ క్రికెట్లో హిట్.. ఐపీఎల్‌లో మాత్రం ఫట్.. కలిసిరాని కాలం

IPL:- డొమెస్టిక్ క్రికెట్లో హిట్.. ఐపీఎల్‌లో మాత్రం ఫట్.. కలిసిరాని కాలం

IPL:- మొత్తానికి 2023 సీజన్ మోస్ట్ ఎక్సైటింగ్‌గా నడుస్తోంది. ఆన్ ఫీల్డ్ డ్రామా, క్రికెటర్ల మధ్య గొడవలు, థ్రిల్లింగ్ మ్యాచులు, హై క్వాలిటీ క్రికెట్‌తో సాగిపోతోంది ఈ సీజన్. కొంతమంది కుర్రాళ్లు ఈ సీజన్‌లో వాళ్ల మార్క్ చూపించారు. సో, రాబోయే రోజుల్లో దేశం తరపున ఆడేందుకు పక్కా ట్రాక్ వేసుకుని కూర్చుకున్నారు. కాని, డొమెస్టిక్ క్రికెట్లో బాగా రాణించి, రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లు మాత్రం ఆ పొట్టి ఫార్మాట్లో సరిగ్గా ఆడలేకపోతున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో రాణించిన వారికి ఐపీఎల్ ఫ్లాట్ ఫాం గొప్ప అవకాశాలు ఇస్తోంది. కమర్షియల్‌గా బాగా వర్కౌట్ అయ్యే ఐపీఎల్‌లో సత్తా చాటితే.. ఇక ఆ తరువాత రేంజే మారిపోద్ది. ఒకవిధంగా.. దేశం తరపున ఆడే మ్యాచులకు జట్టును ప్రిపేర్ చేయడానికి ఐపీఎల్ పర్ఫామెన్స్ కూడా చూస్తున్నారు. అలాంటి సమయంలో ఐపీఎల్‌లోనూ సత్తా చాటాల్సిన ఆటగాళ్లు.. ఈసారి నామమాత్రంగా మిగిలారు.


  1. పృథ్వీ షా
    డొమెస్టిక్ సీజన్‌లో పృథ్వీ షా అదరగొట్టాడు. ఒకవిధంగా అక్కడి పర్ఫామెన్స్ చూసే ఢిల్లీ క్యాపిటల్స్ షాను తీసుకుంది కూడా. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున ఆడిన పృథ్వీ షా… 10 ఇన్నింగ్స్‌లలో 332 పరుగులు చేశాడు. 181 స్ట్రైక్ రేటు, యావరేజ్ 37తో అదరగొట్టాడు. దేశవాళీలో ముంబై జట్టును గెలిపించిన పృథ్వీ షా… ఈ సీజన్‌లో 6 మ్యాచులు ఆడి కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో హైస్కోరు 15 మాత్రమే.
  2. సర్ఫరాజ్ ఖాన్
    దేశవాళీ క్రికెట్లో మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫామెన్స్ చూపించాడు సర్ఫరాజ్ ఖాన్. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. 92 యావరేజ్‌తో 556 పరుగులు చేయడం మామూలు విషయం కాదు. ఈ ఆట తీరు చూసే ఐపీఎల్‌లో తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ రూపంలో పెద్ద దెబ్బ పడింది. పంత్‌ను రీప్లేస్ చేస్తాడనుకంటే సర్ఫరాజ్ ఖాన్ కూడా తేలిపోయాడు. 4 ఇన్నింగ్సులలో కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ జస్ట్ 85.
  3. మయాంక్ అగర్వాల్
    లాస్ట్ సీజన్ రంజీ ట్రోఫీలో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడు మయాంక్ అగర్వాల్. 13 ఇన్నింగ్సులు ఆడి 82 యావరేజ్‌తో ఏకంగా 990 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 155 స్ట్రైక్ రేటుతో 165 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు 8.25 కోట్లు పెట్టి మరీ మయాంక్‌ను దక్కించుకుంది. కాని, ఈ సీజన్ ఐపీఎల్‌లో 8 మ్యాచులు ఆడిన అగర్వాల్.. కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్.


Related News

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

IPL 2025: కోహ్లీకి ఎసరు..RCB లోకి టీమిండియా కెప్టెన్‌ ?

Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

IND vs BAN: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Team India: టీ20 అనుకుని రెచ్చిపోయారు…147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో టీమిండియా ‘ఫాస్టెస్ట్‌’ రికార్డులు

Big Stories

×