EPAPER

KKR vs RCB: ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి.. హోరాహోరీ పోరులో కోల్‌కతా విజయం

KKR vs RCB: ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి.. హోరాహోరీ పోరులో కోల్‌కతా విజయం

IPL 2024 36th Match KKR vs RCB: ఆర్సీబీకి అదృష్టం కలిసి రావడం లేదు. ఐపీఎల్ ప్రారంభంలో వెనుకపడినా, తర్వాత పుంజుకుంటూ ప్రత్యర్థులతో హోరాహోరా పోరాడుతోంది. విజయం ముంగిట వరకు వెళ్లి బోల్తా పడుతోంది. కోల్ కతా తో ఆదివారంనాడు ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది.


టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగు తీసుకుంది. దీంతో మొదట కోల్ కతా బ్యాటింగుకి వచ్చి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 221 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.

223 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు కొహ్లీ (18), కెప్టెన్ డుప్లెసిస్ (7) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో ఫస్ట్ డౌన్ వచ్చిన విల్ జాక్స్ మ్యాచ్ ని పట్టాలెక్కించాడు. 32 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు.


తనకి సపోర్టుగా రజత్ పటీదార్ నిలిచాడు. 23 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి 11.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది.

కానీ అక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది. ఒక్క పరుగు తేడాలో రజత్ పటీదార్ అవుట్ అయ్యాడు. 138 పరుగులకి మరో 13 పరుగులు కలిసిన తర్వాత కెమరాన్ గ్రీన్ (6) అవుట్ అయ్యాడు.

ఇలా 5 వికెట్ల నష్టానికి 151 పరుగుల మీదున్న ఆర్సీబీ 155 పరుగుల వద్దకు వచ్చేసరికి మహిపాల్ లామరర్ (4) అవుట్ అయ్యాడు. సూర్యాస్ ప్రభుదేశాయ్ (24) కాసేపు మెరుపులు మెరిపించాడు. తర్వాత దినేష్ కార్తీక్ (25) మ్యాచ్ ని గెలిపించలేక పోయాడు.

19వ ఓవర్ కి వచ్చింది. ఆర్సీబీ స్కోరు 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల మీద ఉంది. మిచెల్ స్టార్క్ బౌలింగులో ఉన్నాడు. ఇక 6 బంతులు.. 21 పరుగులు చేయాలి. అందరూ ఆశ వదిలేసుకున్నారు. కర్ణ్ శర్మ మాత్రం వదులుకోలేదు. ఫటాఫట్ మూడు సిక్స్ లు కొట్టాడు. ఒక్కసారి సమీకరణాలు గిర్రుమని తిరిగాయి. కళ్లు తెరిచి చూసేసరికి చివరి 2 బంతులు 3 పరుగుల మీద ఆగింది. అందరిలో ఒకటే ఉత్కంఠ.

ఈ టైమ్ లో కర్ణ్ శర్మ కాట్ అండ్ బౌల్డ్ అయిపోయాడు. అప్పటికి 7 బంతుల్లో 3 సిక్స్ ల సాయంతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లాస్ట్ బాల్ 3 పరుగులు, ఒకటే వికెట్. ఫెర్గ్యూసన్ గట్టిగా కొట్టి పరుగు తీశాడు. సింగిల్ పూర్తయ్యింది. సెకండ్ రన్ చేస్తూ రన్ అవుట్ అయిపోయాడు.

అంతే ఒక్క పరుగు తేడాతో కోల్ కతా విజయం సాధించింది. కనీసం రెండో పరుగు పూర్తయితే సూపర్ ఓవర్ కి మ్యాచ్ వెళ్లేది. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. చివరికి ఆర్సీబీ ఎప్పటిలా పదో స్థానంలో ఫిక్స్ అయిపోయింది. కోల్ కతా మాత్రం టాప్ 2లో నిలిచింది.

కోల్ కతా బౌలింగులో హర్షిత్ రానా 2, సునీల్ నరైన్ 2, మిచెల్ స్టార్క్ 1, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రసెల్ 3 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇచ్చిన పికప్ ఒక్కటీ కోల్ కతాని గెలుపు తీరాలకు చేర్చిందని చెప్పాలి. కేవలం 14 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 48 పరుగులు చేశాడు.

Also Read: గ్రీన్ జెర్సీలో బెంగళూరు.. గెలుపోటముల వివరాలివే..

మరో ఓపెనర్ సునీల్ నరైన్ (10), అంగ్ క్రిష్ రఘువంశీ (3), వెంకటేశ్ అయ్యర్ (16) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ కొంచెం జాగ్రత్తగా ఆడాడు. 36 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

రింకూ సింగ్ (24), ఆండ్రి రస్సెల్ (27 నాటౌట్ ), రమణదీప్ సింగ్ (24 నాటౌట్) సాయంతో కోల్ కతా 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

ఆర్సీబీ బౌలింగులో సిరాజ్ 1, యశ్ దయాల్ 2, కెమరాన్ గ్రీన్ 2, ఫెర్గ్యూసన్ 1 వికెట్ పడగొట్టారు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×