EPAPER
Kirrak Couples Episode 1

IPL 2025: ధోని కోసం స్పెషల్‌ రూల్స్‌…చెన్నైకి లాభం ఉంటుందా ?

IPL 2025: ధోని కోసం స్పెషల్‌ రూల్స్‌…చెన్నైకి లాభం ఉంటుందా ?

 


IPL 2025 New retention rules open doors for CSK to retain MS Dhoni : ఐపీఎల్‌ 2025 టోర్నమెంట్‌ కు సంబంధించిన రిటెన్షన్‌ ప్రక్రియను ప్రకటించింది బీసీసీఐ. దీంతో….2025 లో జరుగునున్న ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే తరఫున ఎంఎస్ ధోని కొనసాగుతాడా లేదా అనే చర్చ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. కౌన్సిల్ తెచ్చిన కొత్త రూల్ ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. కౌన్సిల్ అన్ క్యాప్డ్ రూల్ ను తీసుకువచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు సీఎస్కేలోకి ధోనిని రిటైన్ చేసుకోవాలంటే అన్ క్యాప్డ్ ప్లేయర్ గానే తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ధోనిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా కనుక తీసుకుంటే ఆక్షన్ లో నాలుగు కోట్ల కన్నా ఎక్కువగా ఇచ్చేందుకు వీలు ఉండదు.

IPL 2025 New retention rules open doors for CSK to retain MS Dhoni

Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్.. టికెట్ ధర ఎంతో తెలుసా?


కానీ ధోనీకి ఉండే వ్యాల్యూ చాలా ఎక్కువ. కానీ ఈ రూల్ తో ధోని డిమాండ్ తగ్గిపోతుంది. 2022 మెగా ఆక్షన్ లో సీఎస్కే ధోనీని రిటైన్ చేసుకుంది. అప్పుడు ధోనిని 12 కోట్లు పెట్టి మరి తీసుకుంది. అయితే రూల్ ప్రకారం ఐదేళ్లలో ఒక ప్లేయర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కనక ఆడకపోతే అన్ క్యాప్డ్ లిస్ట్ లో ఆ ప్లేయర్ పేరును చేర్చుతారు. ధోని 2019లో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు.

Also Read: IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

అందుకే ఈసారి అన్ క్యాప్డ్ ప్లేయర్ లిస్టులో ధోని పేరును చేర్చారు. అయితే ధోని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడడానికి ఒప్పుకుంటాడా లేదా అనే చర్చ ఉత్కంఠ రేపుతోంది. 2023లో ధోనీకి మోకాలి సర్జరీ అయిన తర్వాత సీఎస్కే కెప్టెన్సీని ఋతురాజ్ గైక్వాడ్ చేతిలో ధోని పెట్టడం జరిగింది. ప్లేయర్ రిటెన్షన్ రూల్ ఫైనల్ అయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఈమధ్య ఓ ఈవెంట్లో ధోని తేల్చి చెప్పారు. దీనిపై ధోని క్లారిటీ ఇచ్చేంతవరకు సస్పెన్షన్ నెలకొంటూనే ఉంటుంది.

Related News

IND vs BAN 2nd Test: బుమ్రా మ్యాజిక్‌.. కుప్పకూలిన బంగ్లాదేశ్..!

IPL 2025: రోహిత్‌ సంచలన నిర్ణయం..అంబానీకి కోట్లల్లో నష్టం ?

Warning To Pakistan Cricketers: ‘ఫిట్‌నెస్ లేకపోతే కాంట్రాక్ట్ రద్దు’.. పాకిస్తాన్ క్రికెటర్లకు పిసిబి గట్టి వార్నింగ్..

RP Singh: RCB ఓ చెత్త టీం, కుక్క కూడా పట్టించుకోదు !

IPL mega auction: ‘రిటెయిన్డ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించాలి’.. ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించిన బిసిసిఐ..

IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

Big Stories

×