IPL 2025 Auction: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి చివరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌పై హీట్ పెరిగింది. ఈ తరునంలోనే… ఐపీఎల్ 2025 మెగా వేలానికి ( IPL 2025 Auction ) రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2025 ( IPL 2025 ) కోసం అన్ని జట్లు తమ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.
Also Read: Virat Kohli: కోహ్లీ బర్త్‌డే…కొడుకు ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ
Also Read: Virat Kohli: అనుష్క శర్మ ఒక్కతే కాదు…5 మందితో హీరోయిన్లతో కోహ్లీ రిలేషన్?
అన్ని జట్లు కలిపి ఇంకా 204 స్థానాలు మాత్రమే ఉండగా…. ఆ ప్లేయర్లను భర్తీ చేయడం కోసం మెగా వేళానికి బీసీసీఐ ( BCCI) డేట్ ఖరారు చేసింది. సౌదీ అరేబియాలోని జెండా (Jeddah ) వేదికగా నవంబర్ 24, 25 రెండు రోజులపాటు భారీ మెగా వేలం జరగనుంది.
Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?
ఐపీఎల్ మెగా వేలం కోసం ఇప్పటికే 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 320 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి మాజీలు కూడా ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరిలోనే వేలంలో ఉన్నారు. 409 మంది విదేశీ క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉండగా… టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలే కాకుండా మరో 30 ఐసీసీ అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కూడా ఐపీఎల్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు.