EPAPER

RR vs GT Highlights IPL 2024: ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం.. రాజస్థాన్‌కు తొలి ఓటమి..

RR vs GT Highlights IPL 2024: ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం.. రాజస్థాన్‌కు తొలి ఓటమి..

Rajasthan Royals vs Gujarat Titans IPL 2024 Highlights : జైపూర్ సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘనవిజయం సాధించింది. గిల్(72), రషీద్ ఖాన్(24*, 11 బంతుల్లో), సాయి సుదర్శన్(35) రాణించడంతో 197 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి చేధించింది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా రషీద్ ఖాన్ 4,2,4,1,W2, 4 కొట్టడంతో ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం సాధించింది. దీంతో రాజస్థాన్ ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసింది.


అంతకుముందు రియాన్ పరాగ్(76, 48 బంతుల్లో), సంజూ శాంసన్(68*, 38 బంతుల్లో) చెలరేగడంతో రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

మెరిసిన గిల్, చెలరేగిన రషీద్

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ శుభారంభం అందించారు. 8.2 ఓవర్లలో 64 పరుగులు జోడించిన తర్వాత సుదర్శన్(35) కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సేన్ వేసిన మరుసటి ఓవర్లో వేడ్(4), అభినవ్ మనోహర్(1) అవుట్ అయ్యారు. దీంతో 79 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది.


మరోవైపు గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 16 పరుగులు చేసిన విజయ్ శంకర్ చాహల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చాహల్ వేసిన మరుసటి ఓవర్లో గిల్(72) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 133 పరుగులకు గుజరాత్ 5 వికెట్లు కోల్పోయింది. 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్పిన తరుణంలో 17వ ఓవర్లో షారుక్ ఖాన్ 6,4 రాహుల్ తెవాటియా 4 కొట్టడంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. దీంతో గుజరాత్ విజయ సమీకరణం 18 బంతుల్లో 42 పరుగులుగా మారింది.

ఈ తరుణంలో అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో షారుక్ ఖాన్(14) ఎల్బీగా వెనుదిరిగాడ. ఆ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్లో తెవాటియా 2, రషీద్ ఖాన్ ఒక ఫోర్ కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 15 పరుగులు కావాల్సి వచ్చింది.

చివరి ఓవర్ తొలి బంతికి రషీద్ ఖాన్ బౌండరీ సాధించాడు. రెండో బంతికి 2 పరుగులు తీయగా, 3వ బంతికి 4 సాధించాడు. దీంతో చివరి 3 బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 2 బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా మూడో పరుగుకి యత్నించి తెవాటియా రనౌట్ అయ్యాడు. దీంతో చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతికి రషీద్ ఖాన్ 4 కొట్టి గుజరాత్ విజయాన్ని ఖరారు చేశాడు.

రాణించిన శాంసన్, పరాగ్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 19 బంతుల్లో 24 పరుగులు చేసిన జైస్వాల్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత ఓవర్లో 8 పరుగులు చేసిన బట్లర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ 42 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 13 ఓవర్లో ఇన్నింగ్స్ స్కోర్ 100 దాటింది. ఈ దశలో రియాన్ పరాగ్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరో ఎండ్‌లో కెప్టెన్ శాంసన్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 48 బంతుల్లో 76 పరుగులు చేసిన రియాన్ పరాగ్ విజయ్ శంకర్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. చివర్లో హెట్మెయర్, శాంసన్ చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

 

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×