EPAPER

IPL 2024: RCB Vs PBKS: నువ్వా నేనా..? ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. గెలుపెవరిది..?

IPL 2024: RCB Vs PBKS: నువ్వా నేనా..?  ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. గెలుపెవరిది..?
RCB vs PBKS
RCB vs PBKS

IPL 2024- RCB Vs PBKS: రోజూ రెండేసీ ఐపీఎల్ మ్యాచ్ లతో ఊపిరి బిగబట్టి చూస్తున్న అభిమానులకు కూసింత ఊరట ఏమిటంటే. సోమవారం ఒకటే మ్యాచ్ జరగనుంది. అది కూడా ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది.


ఆర్సీబీ ఇప్పటికే సీఎస్కే చేతిలో ఓడిపోయి వెనుకడుగులో ఉంది. ఇక నుంచి పుంజుకుని గెలవకపోతే రేస్ లో వెనుకపడి పోయేలాగే ఉంది. నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మ్యాచ్ ఆర్సీబీకి కీలకంగా మారనుంది.

పంజాబ్ కింగ్స్ ఆల్రడీ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించి ఉత్సాహంగా ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేరుకే ఉన్నా అంతా విరాట్ కోహ్లీపైనే ఫోకస్ అంతా ఉంది.


ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 31 సార్లు మ్యాచ్ లు జరిగాయి. పంజాబ్ కింగ్స్ 17 సార్లు, ఆర్సీబీ 14 సార్లు విజయం సాధించాయి.

ఆర్సీబీలో టాప్ ఆర్డర్ పవర్ ఫుల్ గా ఉంది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అంజు రావత్, కర్ణ్ శర్మ, జోసెఫ్, మయాంక్ దగర్, సిరాజ్ ఉన్నారు. వీరిలో మహ్మద్ సిరాజ్ కి పిచ్ మీద పట్టు దొరికితే, ప్రత్యర్థులు క్యూ కట్టాల్సిందే. అంత పవర్ ఫుల్ గా బాల్స్ వేస్తాడు. మ్యాక్స్ వెల్ మ్యాచ్ విన్నర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. రజత్ పటీదార్ ఫస్ట్ మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. ఈసారి కసిగా ఆడతాడని అనుకుంటున్నారు.

Also Read: Harshit Rana Flying Kiss: హర్షిత్ రాణా ఓవరాక్షన్.. బీసీసీఐ రియాక్షన్ అదుర్స్..

పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే కెప్టెన్ శిఖర్ ధావన్ కి ఐపీఎల్ రికార్డ్ బ్రహ్మాండంగా ఉంది. వీరి ఆటంతా పవర్ ప్లే మీదే ఆధారపడి ఉంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో ఇరగదీస్తే, మామూలుగా ఉండదు.. వీళ్లు నిజానికి పవర్ ప్లే లో గానీ 60 నుంచి 70 పరుగులు చేస్తే తర్వాత వాళ్లు 210 నుంచి 220కి తీసుకువెళతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మిడిల్ ఆర్డర్ లో లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, శామ్ కర్రాన్, శశాంక్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్ ఇలా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే అర్షదీప్ సింగ్, కగిసో రబడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్, శామ్ కర్రాన్ ఉన్నారు.

ఆర్సీబీ మీద పోల్చి చూస్తే టీమ్ కొద్దిగా బలహీనంగా ఉన్నా, గెలుపు ముంగిట అంత తేలిగ్గా బోర్లా పడకపోవడమే వీరి బలం అని అందరూ అంటున్నారు. ఆర్సీబీ అనవసరమైన ఒత్తిడితో వికెట్లు పారేసుకుంటుందనే కామెంట్లు ఉన్నాయి.మరి నేడు మ్యాచ్ ఎలా సాగుతుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×