EPAPER

IPL 2024 Eliminator RR vs RCB Highlights: రాయల్‌‌గా క్వాలిఫైయర్-2కి రాజస్థాన్.. ఎలిమినేటర్‌లో బెంగళూరు ఎలిమినేటెడ్..

IPL 2024 Eliminator RR vs RCB Highlights: రాయల్‌‌గా క్వాలిఫైయర్-2కి రాజస్థాన్.. ఎలిమినేటర్‌లో బెంగళూరు ఎలిమినేటెడ్..

IPL 2024 Eliminator Rajasthan Royals vs Royal Challengers Bengaluru Highlights: గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేట్ అయ్యింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఈ సాలా కప్ నమదే అన్న ఆర్సీబీ అభిమానులు మరో ఏడాది వరకు వేచి చూడాల్సిందే.


యశస్వి జైశ్వాల్(45), రియాన్ పరాగ్(36), హెట్మైయర్(26) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో మరో ఓవర్ మిగిలి ఉండగానే రాయల్‌గా విజయం సాధించి క్వాలిఫైయర్ 2 కు చేరుకుంది. దీంతో 24న జరిగే క్వాలిఫైయర్ 2 లో సన్ రైజర్స హైదరాబాద్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు ఫైనల్లో కోల్‌కతా తో అమితుమీ తేల్చుకోనున్నారు.

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, కోలర్-కాడ్‌మోర్ దూకుడుగా ఆడారు. తొలి వికెట్ కు 5.3 ఓవర్లో 46 పరుగులు జోడించారు. ఆ తరువాత పరాగ్, హైట్మైయర్ తలో చేయి వేయడంతో రాయల్స్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.


రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్:

  • స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ వేసిన తొలి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • సిరాజ్ వేసిన రెండో ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు.
  • యశ్ దయాల్ వేసిన మూడో ఓవర్లో జైశ్వాల్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను స్లిప్‌లో గ్రీన్ జారవిడిచాడు. ఈ ఓవర్లో జైశ్వాల్ 4 ఫోర్లతో విరుచుకుపడ్డాడు.3 ఓవర్లు ముగిసేసరికి RR స్కోర్ 22/0
  • సిరాజ్ వేసిన 4వ ఓవర్ తొలి రెండు బంతులకు క్యాడ్ మోర్ బౌండరీలు సాధించాడు. 5వ బంతికి జైశ్వాల్ బౌండరీ సాధించడంతో 4 ఓవర్లు ముగిసేసరికి RR స్కోర్ 35/0
  • యశ్ దయాల్ వేసిన ఐదవ ఓవర్ తొలి బంతికి క్యాడ్‌మోర్ క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ జారవిడిచాడు. లైఫ్ అందిపుచ్చుకున్న క్యాడ్ మోర్ రెండు ఫోర్లు సాధించాడు. దీంతో 5 ఓవర్లకు 45 పరుగులు చేసింది రాజస్థాన్.
  • ఇక పవర్ ప్లే చివరి ఓవర్ వేసిన లాకీ ఫెర్గ్యూసన్ అద్భుతమైన యార్కర్‌తో క్యాడ్‌మోర్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లే ముగిసేలోపు రాజస్థాన్ స్కోర్ 47/1
  • స్వప్నిల్ సింగ్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికే శాంసన్ సిక్స్ కొట్టాడు. జైశ్వాల్ 2 ఫోర్లు బాదడంతో ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.దీంతో 7 ఓవర్లు ముగిసేలోపు RR స్కోర్ 64/1.
  • 8వ ఓవర్ వేసిన ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో 10 పరుగులు రావడంతో RR స్కోర్ 74/1.
  • కర్ణ్ శర్మ వేసిన 9వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
  • కామెరూన్ గ్రీన్ వేసిన 10వ ఓవర్లో 45 పరుగులు చేసిన జైశ్వాల్ అవుట్ అయ్యాడు. దీంతో రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • కర్ణ్ శర్మ వేసిన 11వ ఓవర్ తొలి బంతికి శాంసన్ భారీ షాట్‌కు యత్నించి స్టంపౌట్ అయ్యాడు. తొలి బంతినే జురెల్ బౌండరీకి తరలించాడు. పరాగ్ కూడా బౌండరీ సాధించడంతో 13 పరుగులు వచ్చాయి.
  • రాజస్థాన్ రాయల్స్ విజయానికి 54 బంతుల్లో 75 పరుగులు అవసరం.
  • కామెరూన్ గ్రీన్ వేసిన 12వ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి RR స్కోర్ 100/3
  • ఫెర్గ్యూసన్ వేసిన 13వ ఓవర్లో రియాన్ పరాగ్ సిక్స్ కొట్టడంతో మొత్తంగా 11 పరుగులు వచ్చాయి. దీంతో రాజస్థాన్ విజయానికి 42 బంతుల్లో 62 పరుగులు కావాలి.
  • గ్రీన్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి కోహ్లీ విసిరిన అద్భుతమైన త్రోకి జురెల్ రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 4వ వికెట్ కోల్పోయింది. ఈ ఓవర్లో రాజస్థాన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ విజయ సమీకరణం 36 బంతుల్లో 58 పరుగులు.
  • టైమౌట్
  • సిరాజ్ వేసిన 15వ ఓవర్లో హెట్మైయర్ ఫోర్ సాధించడంతో విజయ సమీకరణం 30 బంతుల్లో 47  పరుగులుగా మారింది.
  • కామెరూన్ గ్రీన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికే హెట్మైయర్ సిక్స్ బాదాడు. మూడో బంతికి పరాగ్ సిక్స్ బాదాడు. 4వ బాల్ కి పరాగ్ ఫోర్ కొట్టడంతో రాజస్థాన్ విజయానికి 24 బంతుల్లో 30 పరుగులు కావాలి.
  • యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్లో హెట్మైయర్ వరుస బంతుల్లో బౌండరీలు సాధించాడు. దీంతో రాయల్స్ విజయ సమీకరణం 18 బంతుల్లో 19 పరుగులు అవసరం.
  • సిరాజ్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి పరాగ్ బౌల్డ్ అయ్యాడు. చివరి బంతికి డు ప్లెసిస్ తీసుకున్న అద్భుత క్యాచ్‌కు హెట్మైయర్ అవుట్ అయ్యాడు.
  • ఫెర్గ్యూసన్ వేసిన 19వ ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు ఫోర్లు సాధించాడు రోవ్ మన్ పావెల్. చివరి బంతికి సిక్స్ సాధించి విజయాన్ని లాంఛనం చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తడబడింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయింది. పటీదార్(34), విరాట్ కోహ్లీ(33), లోమ్రోర్ (32) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, అశ్విన్ 2, చాహల్ 1, బౌల్ట్ 1, సందీప్ శర్మ 1 వికెట్ తీసుకున్నారు.

గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

  • బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ.. క్రీజులో కోహ్లీ, డు ప్లెసిస్
  • ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో బాల్ అద్భుతంగా స్వింగ్ అవ్వడంతో బెంగళూరు బ్యాటర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి ఓవర్ ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 2/0
  • సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో కోహ్లీ ఫోర్ కొట్టి.. ఆర్సీబీ బౌండరీ ఖాతా తెరిచాడు. కెప్టెన్ డు ప్లెసిస్ సిక్స్ కొట్టి సిక్సర్ల ఖాతా తెరిచాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 14/0
  • ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. 3 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 17/0
  • అవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికే కోహ్లీ సిక్స్‌తో బౌలర్‌కి స్వాగతం పలికాడు. 3వ బంతికి, చివరి బంతికి డు ప్లెసిస్ ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మొత్తంగా ఈ ఓవర్లో 17 పరుగులు రావడంతో ఆర్సీబీ స్కోర్ 34/0
  • ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదవ ఓవర్లో రోవ్ మన్ పావెల్ తీసుకున్న అద్భుతమైన క్యాచ్‌కు డు ప్లెసిస్(17) అవుట్ అయ్యాడు. దీంతో కామెరూన్ గ్రీన్ క్రీజులోకి వచ్చాడు. 5 ఓవర్లకు RCB స్కోర్ 37/1
  • సందీప్ శర్మ వేసిన ఆరో ఓవర్లో కోహ్లీ తొలి బంతికి బౌండరీ సాధించాడు. 5వ బంతిని బౌండరీకి తరలించడంతో ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.
  • ముగిసిన పవర్ ప్లే.. RCB స్కోర్ 50/1
  • పవర్ ప్లే ముగియడంతో శాంసన్ అశ్విన్‌ని రంగంలోకి దించాడు. దీంతో 7వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • చాహల్ వేసిన ఏడవ ఓవర్లో కోహ్లీ భారీ షాట్‌‌కు యత్నించి అవుట్ అయ్యాడు. దీంతో రజత్ పటీదార్ క్రీజులోకి వచ్చాడు. 8 ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 58/2
  • అశ్విన్ వేసిన 9వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • చాహల్ వేసిన 10వ ఓవర్ తొలి బంతికే గ్రీన్ సిక్స్, రెండో బంతికి ఫోర్ కొట్టడంతో ఆర్సీబీ శిబిరంలో ఊపొచ్చింది. మొత్తంగా పది ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 76/2
  • అశ్విన్ వేసిన 11వ ఓవర్లో పటీదార్ ఇచ్చిన క్యాచ్‌ను జురెల్ జారవిడిచాడు. మొత్తంగా ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
  • అవేశ్ ఖాన్ వేసిన 12వ ఓవర్లో పటీదార్ 4, గ్రీన్ 4 కొట్టారు. దీంతో 12 ఓవర్లకు RCB స్కోర్ 95/2
  • అశ్విన్ వేసిన 13వ ఓవర్లో గ్రీన్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. తొలి బంతికే మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి మహిపాల్ లోమ్రోర్ వచ్చాడు. మొత్తంగా ఈ ఓవర్లో 2 పరుగులే వచ్చాయి. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 97/4
  • చాహల్ వేసిన 14వ ఓవర్లో పటీదార్ తొలి బంతికి సిక్స్ కొట్టడంతో RCB స్కోర్ వంద పరుగులు దాటింది. 3వ బంతికి లోమ్రోర్ కూడా సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.
  • అవేశ్ ఖాన్ వేసిన 15వ ఓవర్ తొలి బంతిని సిక్స్ బాదాడు పటీదార్. ఆ తరువాత బంతికే పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 5వ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ తొలి బంతికే ఎల్బీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 125/5
  • చాహల్ వేసిన 16వ ఓవర్లో లోమ్రోర్ 6 కొట్టడంతో ఈ ఓవర్లో 9 పరుగుల వచ్చాయి.
  • టైమౌట్
  • సందీప్ శర్మ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని డీకే బౌండరీ తరలించాడు. ఈ ఓవర్లో 10 పరుగులు రావడంతో 17 ఓవర్లకు RCB స్కోర్ 144/7
  • బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో కేవలం 10 పరుగులే వచ్చాయి.
  • అవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్(11) పెవిలియన్ చేరాడు. ఫోర్ కొట్టి ఊపమీదున్న లోమ్రోర్(32) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది.
  • సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో కర్ణ్ శర్మ 4, స్వప్నిల్ సింగ్ 6 కొట్టడంతో ఆర్సీబీ 172 పరుగులు చేసింది.

Tags

Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×