EPAPER

Playoff Schedule Matches : ప్లే ఆఫ్ షెడ్యూల్ మ్యాచ్ లు ఇవే..

Playoff Schedule Matches : ప్లే ఆఫ్ షెడ్యూల్ మ్యాచ్ లు ఇవే..

IPL 2024 Playoff Matches : ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు వచ్చింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్ కి చేరుకున్నాయి. అందరిలో చిన్న కన్ ఫ్యూజన్ నడుస్తోంది. క్వాలిఫైయర్ ఏమిటి? ఎలిమినేటర్ రౌండ్ ఏమిటి? అందుకే, ఏ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో, సవివరంగా తెలిపే ప్లే ఆఫ్ షెడ్యూల్ ఒకసారి చూడండి.


క్వాలిఫైయర్ 1

కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ : (మే 21, మంగళవారం)
ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇక్కడ గెలిచిన జట్టు డైరక్టుగా ఫైనల్ కి వెళుతుంది. ఓడిన జట్టుకి ఒక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడుతుంది. అక్కడ గెలిచిన జట్టు ఫైనల్ కి చేరుతుంది.


ఎలిమినేటర్

రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు (మే 22, బుధవారం)
ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకి మరొక ఛాన్స్ ఉండదు. టాప్ 2 లో ఉన్నవాళ్లకే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓడితే ఇంటికి వెళ్లిపోవడమే. అయితే ఇక్కడ గెలిచిన జట్టు, క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.

క్వాలిఫైయర్ 2 : ( మే 24, శుక్రవారం)

క్వాలిఫైయర్ 1 లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు కలిసి క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడతాయి. ఇది చెన్నయ్ లోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళుతుంది. ఓడిపోతే టోర్నీ నుంచి తప్పుకుంటుంది.

ఫైనల్ మ్యాచ్ (మే 26, ఆదివారం)

క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్టు, క్వాలిఫైయర్ 2 లో గెలిచిన జట్టు కలిసి ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. ఇది కూడా చెన్నయ్ లోని చిదంబరం స్టేడియంలోనే జరుగుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు ఐపీఎల్ 2024 విజేత అవుతుంది. ట్రోఫీ సాధిస్తుంది.

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×