EPAPER

LSG vs PBKS: ధావన్ పోరాటం వృథా.. లక్నో బోణీ..

LSG vs PBKS: ధావన్ పోరాటం వృథా.. లక్నో బోణీ..
Lucknow Super Giants vs Punjab Kings
Lucknow Super Giants vs Punjab Kings

Lucknow Super Giants vs Punjab Kings: లక్నో ఏకనా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో ఘనవిజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యచేధనలో పంజాబ్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. ధావన్(70, 50 బంతుల్లో 3X6, 7X4), బెయిర్‌స్టో (42, 29 బంతుల్లో 3X6, 3X4), లివింగ్‌స్టోన్(28*, 17 బంతుల్లో 2X6, 2X4) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దీంతో లక్నో ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.


అంతకుముందు డికాక్(54, 38 బంతుల్లో; 5×4, 2X6), పూరన్(42, 21 బంతుల్లో 3×4, 3X6), కృనాల్ పాండ్యా(43*, 22 బంతుల్లో; 4×4, 2X6) రాణించడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. 11.4 ఓవర్లలో 102 పరుగులు జోడించారు. 29 బంతుల్లో 42 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


మరో ఓపెనర్ ధావన్‌తో జతకట్టిన ఇంపాక్ట్ సబ్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కేవలం 7 బంతుల్లో 19 పరుగులు చేసిన నవీన్ ఉల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్యటింగ్‌కు వచ్చిన జితేశ్ శర్మ 6 పరుగులు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

పంజాబ్ విజయానికి చివరి 4 ఓవర్లలో 60 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 70 పరుగులు చేసిన ధావన్ మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే సామ్ కర్రన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఆ ఓవర్లో కేవలం 4 పరుగుల మాత్రమే వచ్చాయి. విజయ సమీకరణం 18 బంతుల్లో 56 పరుగులుగా మారింది.

నవీన్ ఉల్ హక్ వేసిన 18వ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. కృనాల్ పాండ్య వేసిన 19వ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో 41 పరుగులు అవసరం కాగా లక్నో విజయం లాంఛనమైంది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకి ఓపెనర్లు శుభారంభం అందించారు. కేవలం 3.5 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. 15 పరుగులు చేసిన రాహుల్ అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 9 పరుగులు చేసిన వన్ డౌన్ బ్యాటర్ పడిక్కల్ సామ్ కర్రన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఈ దశలో ఓపెనర్ డికాక్‌కు మార్కస్ స్టోయినిస్ తోడయ్యాడు. 19 పరుగులు చేసిన స్టోయినిస్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ పూరన్ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌ను అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 42 పరుగులు చేసిన పూరన్ రబాడ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

ఈ దశలో కృనాల్ పాండ్య కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి లక్నో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Tags

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×