EPAPER

Rohit Sharma Leaves MI: రోహిత్ శర్మ.. ముంబైని వదిలేస్తున్నాడా..?

Rohit Sharma Leaves MI: రోహిత్ శర్మ.. ముంబైని వదిలేస్తున్నాడా..?
Rohit Sharma In IPL 2024
Rohit Sharma In IPL 2024

Rohit Sharma Leaves Mumbai Indians Team in IPL: ఈ వార్త నిజమేనని అటు మీడియా, ఇటు నెట్టింట తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ముంబైని వదిలేయక మరేం చేస్తాడు? నువ్వు వద్దురా బాబూ అన్నా, సూరుపట్టుకుని ఏలాడతాడా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న చెరువులో రాయి విసిరితే, నీళ్లన్నీ చెల్లా చెదురైనట్టు.. ప్రశాంతంగా ఉన్న ముంబయి జట్టులోకి హార్దిక్ అనే రాయిని తెచ్చి వేశారని, ఇప్పుడు నీళ్లన్నీ అటో ఇటో పోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. కనీస గౌరవ మర్యాదలు లేకుండా కెప్టెన్సీ పీకేస్తే, రోహిత్ శర్మకి ఆ మాత్రం ఆత్మాభిమానం లేదా? అని కొందరు రెచ్చగొడుతున్నారు.


మీరు కాకపోతే మరో 9 జట్లున్నాయి. వేటిలోనూ ఖాళీ లేకపోతే హాయిగా టీమ్ ఇండియా కెప్టెన్ గా ఆడుకుంటాడని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ శర్మ బయటకు వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస ఓటములతో ముంబై విలవిల్లాడుతోంది. దీనికి రోహిత్ శర్మను కూడా బ్లెయిమ్ చేస్తున్నారు. తను కావాలనే సరిగా ఆడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో ఒత్తిడిని తట్టుకోలేక , అది తన ఆటతీరుపై ప్రభావం చూపిస్తుందని భావించి వెళ్లిపోదామని ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.


Also Read: ఇలాగైతే ఆర్సీబీ ఎప్పటికీ కప్ కొట్టలేదు.. అంబటి సీరియస్..!

ఈసారి ఐపీఎల్ లో తను ఆడకూడదని రోహిత్ అనుకున్నాడు. కానీ ఎందుకో పై నుంచి వచ్చిన ఒత్తిడివల్ల మళ్లీ జట్టులో చేరాడు. అయితే అప్పటి నుంచి జట్టులో పాండ్యా-రోహిత్ మధ్య విభేదాలు తీవ్రమైనట్టు సమాచారం. రోహిత్ ఉంటే, తను 100శాతం శక్తి సామర్థ్యాలతో ఆడలేకపోతున్నట్టు పాండ్యా అంటున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అంటున్నారు.

మరోవైపు సగం టీమ్ రోహిత్ వైపే ఉండటం, పాండ్యా నిర్ణయాలని సీరియస్ గా తీసుకోకపోవడంతో తను ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఒక ప్లాన్ ప్రకారం గేమ్ జరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సీక్వెన్స్ నేపథ్యంలో రోహిత్ శర్మపై ముంబై ఫ్రాంచైజీ కూడా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.  న్యూస్ 24 స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం 2024 ఆఖర్లో జరగనున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనాలని రోహిత్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×