IPL 2023: ఐపీఎల్ 16 సీజన్‌లో భాగంగా శనివారం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కోల్‌కతాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భానుక రాజపక్స 32 బంతుల్లో 50 పరుగులు చేయగా.. శిఖర్ ధవన్ 40 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్ టిమ్ సాథీ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. అదే సమయంలో భారీగా వర్షం పడడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆర్ష్‌దీప్ సింగ్ దక్కించుకున్నాడు.
ఇక శనివారం జరిగిన రెండో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 48 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్ వుడ్ ఒక్కడే 5 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వుడ్‌కు దక్కింది.