ipl 2023 Hero’s : గెలవాల్సిన మ్యాచ్‌కు అడ్డుపడి.. సొంత జట్టును గెలిపించిన బౌలర్.. సందీప్ శర్మ. మొన్నటి మ్యాచ్ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. 2023 సీజన్‌లో సందీప్ శర్మను అసలు ఎవరూ కొనలేదు. ప్రసిద్ధ్ కృష్ణ గాయపడడంతో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అలా గాయాలతో ఫామ్ కోల్పోయి.. ఇక అక్కర్లేదనుకున్న వాళ్లే ఐపీఎల్‌లో సత్తా చాటారు. అచ్చం సందీప్ శర్మలా.
2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున ఆడిన ఇమ్రాన్ తాహీర్ సీజన్ లో అద్భుతమే చేశాడు. టీ20ల్లో ఒకప్పుడు నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న ఇమ్రాన్ తాహీర్ ను… 2017 ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఎవరూ కొనలేదు. ఆ సీజన్‌లో రీప్లేస్ మెంట్ ప్లేయర్ గా పుణె జట్టులో ఉన్నాడు తాహీర్. మిచెల్ మార్ష్ గాయపడడంతో.. ఆ ప్లేస్‌లో వచ్చి అదరగొట్టాడు. ముంబైతో జరిగిన ఆ మ్యాచ్‌లో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ మూడు వికెట్లు తాహీర్ తీయడంతో.. ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కోలుకోలేకపోయింది. రీప్లేస్ మెంట్ ప్లేయర్ గా వచ్చి పుణెకు సూపర్ విక్టరీ అందించాడు.
ఎన్రిచ్ నోర్ట్జే.. ఐపీఎల్ 2020 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఈ సౌతాఫ్రికన్ ఫాస్ట్ బౌలర్.. క్రిస్ వోక్స్ కు రీప్లేస్ మెంట్ ప్లేయర్ గా గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో గెలిచిందంటే.. ఎన్రిచ్ నోర్ట్జేనే కారణం. 33 పరుగులు ఇచ్చి కీలక సమయంలో 2 వికెట్లు తీసి మ్యాచ్ ను టర్న్ చేశాడు. ఆ మ్యాచ్ కు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా అందుకున్నాడు.
ఇక రజత్ పాటిదార్. 2022 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడిన ఈ ప్లేయర్ బ్యాట్ తో సత్తా చాటాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో లన్విత్ సిసోడియా గాయపడితే… ఆ ప్లేస్ లో రీప్లేస్ మెంట్ ప్లేయర్ గా గ్రౌండ్ లో దిగాడు రజత్ పాటిదర్. ఆ మ్యాచ్ లో 54 బాల్స్ లో ఏకంగా 112 పరుగులు తీసి వారెవ్వా అనిపించాడు. ఇలా అక్కర్లేదనుకున్న వాళ్లే.. వేరొకరి ప్లేస్ లో రీప్లేస్ మెంట్ గా వచ్చిన వాళ్లే మ్యాచ్ లో మెరుపులు మెరిపించారు.