EPAPER

Indian Boxer Nishant dev: మోసం గురూ.. మన బాక్సర్ మెడల్ నొక్కేశారు!

Indian Boxer Nishant dev: మోసం గురూ.. మన బాక్సర్ మెడల్ నొక్కేశారు!

Indian Boxer Nishant Dev’s loss at Paris Olympics sparks controversy: పారిస్ ఒలింపిక్స్‌లో మరో వివాదం చోటు చేసుకుంది. మహిళా బాక్సింగ్ పోటీల్లో లింగ వివక్ష రచ్చ ముగియకముందే, మరొకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఇది భారత బాక్సర్ కి సంబంధించినది, అయితే ఇక్కడ అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు సంబంధించినది కావడం, భారత ప్రముఖులు స్పందించడంతో నెట్టింట సెగ మరింత పెరిగింది.


ఇంతకీ విషయం ఏమిటంటే,  భారత బాక్సర్ నిశాంత్ దేవ్ అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ నిరాశ ఎదురైంది. 71 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో మెక్సికో బాక్సర్ మార్కో వేర్డే చేతిలో 4-1 తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించిన నిశాంత్ ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ జడ్జిలు మాత్రం మెక్సికో బాక్సర్ ను విజేతగా ప్రకటించడంపై విమర్శలు వచ్చాయి.

దీంతో నిశాంత్ కు మద్దతుగా భారత మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా పోస్టులు పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి.


నిశాంక్ బాధపడకు, అసలు స్కోరింగ్ ఎలా చేశారో అర్థం కావడం లేదని విజేందర్ ట్వీట్ చేశాడు. నిశాంక్ చాలా అద్భుతంగా పోరాడాడు. అందులో సందేహమే లేదని పేర్కొన్నాడు.

బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా మాట్లాడుతూ ఈ స్కోరింగ్ విధానం సరైనదేనా? అంపైర్లు తప్పులు చేస్తే, ప్రశ్నించేవారే లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీ పతకాన్ని వాళ్లు దోచుకున్నారు. కానీ నువ్వు అశేష భారతీయుల మనసులు గెలుచుకున్నావని ప్రశంసించాడు.

Also Read: ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాల్లో పతకధారి మను బాకర్

విశ్వ క్రీడల్లో ఇలాంటివి జరగడం.. భవిష్యత్ క్రీడలకు మంచిది కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో జరుగుతున్న ఆటల పోటీలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నప్పటికి, ఎవరో చేసిన తప్పిదాలకు ఒలింపిక్ కమిటీ కి తలవంపులు వస్తున్నాయని అంటున్నారు.

కెనడా మహిళా హాకీ జట్టు డ్రోన్ ఎగరవేయడం, దక్షిణ కొరియా పేరు తప్పుగా చెప్పడం, మహిళా బాక్సర్ ఖెలీఫ్ వ్యవహారం, ఇప్పుడు మన భారత క్రీడాకారుడు నిశాంత్ విషయంలో అంపైర్ల పార్షియాలిటీ, నదిపై ప్రారంభోత్సవాలు, నీరు కలుషితం కావడం వీటన్నింటిపై బహిరంగ చర్చ జరగాలని నెటిజన్లు కోరుతున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×