EPAPER

India vs South Africa : ఫైనల్‌లో యువభారత్.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజయం..

India vs South Africa : ఫైనల్‌లో యువభారత్.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజయం..
Under-19 World Cup

Under-19 World Cup (sports news today):


ఫైనల్‌లో సౌతాఫ్రికా‌పై భారత్ 2 వికేట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌కు చేరుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలో చేధించింది.

అండర్ 19 ప్రపంచకప్ లో ఓటమి అన్నది లేకుండా సెమీస్ లోకి అడుగుపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అనూహ్యరీతిలో పుంజుకుని విజయం సాధించింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా సౌతాఫ్రికాను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. 50 ఓవర్లలో సౌతాఫ్రికా 244 పరుగులు చేసింది.


245 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, విలవిల్లాడింది. ఇంతవరకు అద్భుతంగా ఆడిన నలుగురు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై అవుట్ అయిపోయారు.

ఈ మ్యాచ్ లో వరుసగా రెండు సెంచరీలు, ఒక ఆఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా ఉన్న ముషీర్ ఖాన్ కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఇంతవరకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఓపెనర్ ఆదర్శ్ సింగ్ డక్ అవుట్ అయ్యాడు. సిరీస్ మొత్తం అంతంత మాత్రంగా ఆడిన అర్షిన్ కులకర్ణి (12) ఎప్పటిలా తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు.   ప్రియాన్షు మోలియా (5) పరిస్థితి అలాగే తయారైంది.

ఇలా నలుగురు బ్యాటర్లు చేతులెత్తేయడంతో కెప్టెన్ ఉదయ్ సహరన్ ఒంటరిగా నిలిచాడు. తనకి సచిన్ దాస్ (96) మద్దతు దొరకడంతో నెమ్మదిగా డిఫెన్స్ ఆడుతూ స్కోరు బోర్డుని అలా ముందుకు తీసుకువెళ్లాడు. 32 పరుగుల వద్ద 4 వికెట్లు పడిపోయిన టీమ్ ఇండియా మళ్లీ 5 వికెట్ 203 పరుగుల వద్ద పడింది. అది కూడా దురద్రష్టవశాత్తూ సెంచరీకి 4 పరుగుల దూరంలో సచిన్ దాస్ అవుట్ అయిపోయాడు.

అప్పటికి టీమ్ ఇండియా విజయానికి ఇంకా 42 పరుగులు కావాలి. 63 బాల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి టెన్షన్ మొదలైంది. తెలుగు ఆటగాడు అరవెల్లి అవనీశ్ రావు 10 పరుగులు చేసి సౌతాఫ్రిక ఫీల్డర్ నార్టన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కి అవుట్ అయిపోయాడు.

తను అవుట్ అయ్యే సమయానికి 18 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంక అక్కడ నుంచి బాల్ బాల్ కి టెన్షన్ మొదలైంది. ఒకవైపున కెప్టెన్ ఉదయ్ వాల్ లా నిలిచాడు. తర్వాత వచ్చిన మురుగన్ సింగిల్ రన్ కి పరుగెత్తి డైరక్ట్ త్రోకి అవుట్ అయ్యాడు. 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బౌలర్ రాజ్ లింబానీ ఒక్క సిక్స్ కొట్టి టెన్షన్ రిలీజ్ చేశాడు. అప్పటికి 11 రన్స్ 13 బాల్స్ గా మారిపోయింది. ఆ ఓవర్ ఆఖరి బాల్ కి రెండు పరుగులు వేగంగా చేయడంతో 12 బాల్స్ లో 9 రన్స్ చేసే పరిస్థితి వచ్చింది.

రెండో ఓవర్ మొదటి బంతిని కెప్టెన్ ఉదయ్ ఫోర్ కొట్టాడు. తర్వాత సింగిల్ తీశాడు. వెంటనే రెండు వైడ్స్ వచ్చాయి.  10 బాల్స్ లో 2 పరుగులు చేయాలి. ఒక సింగిల్ తీశారు. స్కోరు 244 పరుగులు సమానమైంది. అప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించిన కెప్టెన్ ఉదయ్ సహరన్ (81) రన్ అవుట్ అయ్యాడు. అలా ఒక అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది.  8 వికెట్లకు 244 పరుగుల వద్ద మళ్లీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది.

8 బాల్స్ 1 పరుగు వద్ద రాజ్ లింబానీ ఫోర్ కొట్టి జట్టు విజయాన్ని సంపూర్ణం చేశాడు. మొత్తానికి టీమ్ ఇండియా దిగ్విజయంగా ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇంక ఒక అడుగు దూరంలో డిఫెండింగ్ ఛాంపియన్ నిలిచింది.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×