BigTV English

NZ vs IND: ఇండియా సూపర్బ్ విక్టరీ.. సూర్యకుమార్ సెన్సేషనల్ ఇన్నింగ్స్..

NZ vs IND: ఇండియా సూపర్బ్ విక్టరీ.. సూర్యకుమార్ సెన్సేషనల్ ఇన్నింగ్స్..

NZ vs IND: న్యూజిలాండ్ పై 65 రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో టీ20 గెలుపుతో సిరీస్ లో ఆధిక్యానికి దూసుకెళ్లింది. మిస్టర్ 360 సూర్యకుమార్ చెలరేగి సెంచరీ చేయడంతో 191 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేజింగ్ లో చతికిలపడిన కివీస్.. 126 పరుగులకే ఆల్ అవుట్ అయింది.


ఓపెనర్ ఫిన్‌ అలెన్‌ 0(2) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. విలియమ్సన్‌తో కలిసి కాన్వే కాస్త దూకుడు పెంచాడు. కాన్వే 25(22) ను వాషింగ్టన్‌ సుందర్‌ అవుట్ చేయడంతో కివీస్ పతనం స్టార్ట్ అయింది. విలియమ్సన్‌ 61(52) ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో 18.5 ఓవర్లకు 126 పరుగులు చేసి న్యూజిలాండ్ ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీయగా, చాహల్‌, సిరాజ్‌ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. సూర్యకుమార్‌ యాదవ్ 6 సిక్సులు, 10 ఫోర్లతో.. 51 బంతుల్లో 111 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ‌ఓపెనర్ గా పంత్(6) మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇషాన్(36), శ్రేయస్(13), హార్దిక్(13) పరుగులు చేశారు. చివరి ఓవర్ లో కేవలం 5 పరుగులే ఇచ్చి.. హ్యాట్రిక్ వికెట్స్ తీశాడు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథి. ఫెర్గూసన్ రెండు, ఇష్ సోథీ ఒక వికెట్ తీశారు. సూర్య రాణించడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేజింగ్ లో తడబడి న్యూజిలాండ్ ఓడింది.


మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం అయింది. రెండు మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. మూడో మ్యాచ్ కీలకం కానుంది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×