EPAPER

IND W vs AUS W Only Test : చరిత్ర సృష్టించిన భారత్.. ఆస్ట్రేలియాపై ఘనవిజయం..

IND W vs AUS W Only Test : చరిత్ర సృష్టించిన భారత్.. ఆస్ట్రేలియాపై ఘనవిజయం..

IND W vs AUS W Only Test : భారత మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టికరిపించి చారిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించిన భారత జట్టు ఆస్ట్రేలియాపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే.. జయకేతనం ఎగురవేసింది.


కాగా భారత్‌తో ఏకైక టెస్టులో తలపడేందుకు.. ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల నడుమ డిసెంబరు 21న వాంఖడే వేదికగా మ్యాచ్‌ ఆరంభమైంది. ముందుగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ నాలుగు, స్నేహ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్‌గ్రాత్ 50, మూనీ 40 పరుగులు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ (40), స్మృతి మంధాన (74) పరుగులతో అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. మిడిలార్డర్‌లో వచ్చిన రిచా ఘోష్‌ 52, జెమీమా రోడ్రిగ్స్‌ 73 పరుగులతో కంగారూల నడ్డి విడిచారు. లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్‌ 47 పరుగులు చేయడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 406 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.


ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 233 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌‌లోనూ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.నాలుగో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా లోయర్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో 261 పరుగులకు ఆలౌట్‌ అయ్యంది. భారత బౌలర్లలో స్నేహ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగింది. రాజేశ్వరి గైక్వాడ్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండేసి వికెట్లు, పూజా వస్త్రాకర్‌ ఒక వికెట్ పడగొట్టి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు.

ఈ క్రమంలో 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్‌ 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఎనిమిది వికెట్ల తేడాతో కంగారూలపై జయభేరి మోగించింది. మ్యాచ్‌లో ఏడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన స్నేహ రాణ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఇదే తొలి విజయం. సొంతగడ్డపై 1984 తర్వాత ఆసీస్‌తో టెస్టు ఆడటం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు భారత్‌- ఆసీస్‌ మహిళా జట్లు టెస్టుల్లో పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆస్ట్రేలియా నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్‌ డ్రా అయ్యింది.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×