EPAPER

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

India Women vs New Zealand Women, 4th Match: మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గురువారం రోజున అట్టహాసంగా ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా మన టీమిండియా కూడా.. ఇవాళ మ్యాచ్ కు సిద్ధమైంది. ఇవాళ న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌ యూఏఈలోని అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ ను డిస్నీ హాట్‌ స్టార్, స్టార్‌ స్పోర్ట్స్‌ లో చూడవచ్చును.


అయితే టీమిండియా మహిళల జట్టు న్యూజిలాండ్ జట్లను పరిశీలించినట్లయితే…. మన ఇండియా నే పటిష్టంగా కనిపిస్తోంది. కానీ కొన్నిసార్లు గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా చేతులెత్తేయడం కూడా ఈ మధ్య జరిగింది. ముఖ్యంగా ఓపెనర్లు తొందరగా వికెట్ కోల్పోతే… మిగిలిన బ్యాటర్లు కూడా వరుసగా క్యూ కడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌ బ్యాటింగ్ లైనప్‌.. కాస్త మెరుగైతే కచ్చితంగా టీమిండియా విజయం సాధిస్తుంది.

Also Read: Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ


మిడిల్ ఆర్డర్‌ బ్యాటింగ్‌ బాగుపడితే…పెద్ద టార్గెట్ అయినా పెట్టవచ్చు… లేక ఎంత పెద్ద టార్గెట్ అయినా టీమిండియా చేదించే సత్తా ఉంటుంది. ప్రతిసారి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లపై మనం ఆధారపడలేము. కాబట్టి మిడిల్ ఆర్డర్‌ పైన కూడా దృష్టి పెట్టాలి. అటు న్యూజిలాండ్ జట్టు త్వరగా మన బౌలర్లు కట్టడి చేస్తే… మంచి రిజల్ట్ దక్కవచ్చు. అటు టీమ్ ఇండియాను కచ్చితంగా ఓడిస్తామని న్యూజిలాండ్ జట్టు వ్యూహాలు రచిస్తోంది.

Also Read: Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

వాస్తవంగా ఈ టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్… బంగ్లాదేశ్లో జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ఈవెంట్ ను యూఏఈకి మార్చింది ఐసీసీ. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు కోసం.. ఈమధ్య దారుణమైన గొడవలు జరిగాయి. దీంతో అక్కడి ప్రధాని కూడా దేశాన్ని వదిలిపోవడం జరిగింది. అయితే అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో.. టి20 మహిళల ప్రపంచకప్ 2024 టోర్నమెంటును.. బంగ్లాదేశ్ నుంచి యూఏఈ కి తరలించారు.

జట్లు వివరాలు

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తిక భాటియా (వికెట్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికె), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, డి హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజీవన్ సజన

న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇసాబెల్లా గాజ్ (WK), మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, జెస్ కెర్, అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు

Related News

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Shardul Thakur: 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్..నువ్వు రియల్‌ హీరో శార్దూల్‌!

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

Big Stories

×