India vs New Zealand : టీమిండియా ( Team India) మహిళల జట్టు వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మహిళల జట్ల మధ్య… ఇవాళ మరో ఫైట్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా… ఇవాళ రెండవ వన్డే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra modi stadium )… న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( Team India) మధ్య రెండవ వన్డే జరుగుతుంది. ఈ మేరకు రెండు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.
ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు… న్యూజిలాండ్ ( New Zealand ) వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో మొదటి టాస్ నెగ్గిన జట్టు… బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. పిచ్ కండిషన్స్ కూడా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు అనుకూలించే ఛాన్సులు ఉన్నాయి. అందుకే మొదట టాస్ నెగ్గిన జట్టు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
Also Read: MS Dhoni: ఐపీఎల్ 2025 నుంచి ఔట్..ఝార్ఖండ్ ఎన్నికల బరిలోకి ధోనీ ?
ఇది ఇలా ఉండగా… ఈనెల 24వ తేదీన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మహిళల జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. మొదటి వన్డేలో న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. మొన్ననే టి20 ప్రపంచ కప్ గెలిచిన న్యూజిలాండ్ ను … మహిళల టీమ్ ఇండియా జట్టు 59 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది మహిళల టీమిండియా జట్టు.
Also Read: IND VS NZ: రెండో టెస్ట్ లో టీమిండియా ఓటమి..69 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన న్యూజిలాండ్!
అయితే ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇందులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది న్యూజిలాండ్ ( New Zealand ) . అటు ఈ మ్యాచ్ గెలిచి ఎలాగైనా సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా స్కెచ్ లు వేస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పైన…అందరికీ ఆసక్తి నెలకొనడం జరిగింది. ఇది ఇలా ఉండగా మొదటి వన్డేలో… 44.3 ఓవర్లలో 227 పరుగులు చేసింది టీమిండియా. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో న్యూజిలాండ్… అట్టర్ ఫ్లాప్ అయింది. 40.4 ఓవర్లలో… కేవలం 168 పరుగులకే న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయింది. ఈ తనంలోనే టీమిండియా ( Team India) 59 పరుగులతో విజయం సాధించడం జరిగింది.
ఇరు జట్ల వివరాలు
భారతదేశ మహిళలు: స్మృతి మంధాన (సి), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (WK), దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తేజల్ హసబ్నిస్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సైమా ఠాకోర్, రేణుకా ఠాకూర్ సింగ్.
న్యూజిలాండ్ మహిళలు : సుజీ బేట్స్, సోఫీ డివైన్ (సి), జార్జియా ప్లిమ్మర్, బ్రూక్ హాలిడే, లారెన్ డౌన్, ఇసాబెల్లా గాజ్ (వారం), మాడీ గ్రీన్, లీ తహుహు, జెస్ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, ఈడెన్ కార్సన్.