EPAPER

India women beat UAE-W: యూఏఈపై భారత్ ఘన విజయం.. బౌండరీలతో అదరగొట్టిన రిచా

India women beat UAE-W: యూఏఈపై భారత్ ఘన విజయం.. బౌండరీలతో అదరగొట్టిన రిచా

India women beat UAE-W by 78 Runs: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో టీమిండియా వరుసగా మరోసారి గెలిచింది. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు తీసింది. అయితే, టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ ఏడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.


యూఏఈ జట్టులో కవిషా 40 పరుగులు తీసింది. అందులో 32 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ తీసింది. రోహిత్ ఓజా (38 – 36 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లు), తీర్థ సతీష్ -4, రినిత -7, సమైరా ధరణిధర్క -5, ఖుషీ శర్మ -10, హీనా -8 పరుగలు తీశారు.

భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీప్తి శర్మ -2 వికెట్ల తీయగా, రేణుకా సింగ్, కన్వర్, పుజా వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ తీశారు.


Also Read: కోచ్ గౌతం గంభీర్ సహాయకులు వీరేనా?

టీమిండియా ప్లేయర్లు.. హర్మన్ ప్రీత్ కౌర్ (66 – 47 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్లు), రిచా ఘోష్ (64- 29 బంతుల్లో 1 సిక్స్, 12 ఫోర్లు), ఓపెనర్ షఫాలీ వర్మ(37 – 18 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (14), స్మృతి మంధాన (13) పరుగులు తీశారు. కాగా, భారత్ 4.2 ఓవర్లకే 52 పరుగులు చేసింది. తరువాత వరసుగా రెండు వికెట్లను కోల్పోయింది. వెంటనే రంగంలోకి దిగిన హర్మన్ ప్రీత్.. జెమీమాతో కలిసి జట్టును ఆదుకుంది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రిచా ఘోష్ బౌండరీలతో అదరగొట్టింది.

యూఏఈ బౌలర్లు.. కవిషా 2 వికెట్లు తీయగా, హీనా, సమైర తలో వికెట్ పడగొట్టారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×