EPAPER

T20 Match: క్రికెటర్‌పై వేటు పడే ఛాన్స్.. జింబాబ్వేతో ఆడే ఫైనల్‌ జట్టు ఇదే

T20 Match: క్రికెటర్‌పై వేటు పడే ఛాన్స్.. జింబాబ్వేతో ఆడే ఫైనల్‌ జట్టు ఇదే

India Vs Zimbabwe For 5th T20 Sanju Samson Out Dhruv Jurel in: టీమిండియా ఆఖరి పోరుకు జింబాబ్వే పర్యటనకు రెడీ అయ్యింది. టీ20 ఐదు సిరీస్‌లకు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌‌లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో టీమిండియా బెంచ్ ఆటగాళ్లను ఆడించే ఛాన్స్ ఉంది.


మరోవైపు ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి తమ భారత్‌ అభిమానులను సంతోషపరచాలని జింబాబ్వే భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లయినా రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అవకాశం ఇస్తే తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సిరీస్‌లో టాప్ 3 బ్యాటర్లకు మినహా ఇతరులకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.

ఓ వైపు శ్రీలంక పర్యటన నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌‌, సంజూ శాంసన్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఇద్దరిని తప్పిస్తే కనుక అభిషేక్ శర్మ ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. రియాన్ పరాగ్ మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగుతాడు. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ బరిలోకి దిగనున్నాడు. ఇక ఇందులో ఆటగాళ్లు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.. తొలి రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడారు. యశస్వి జైస్వాల్‌ను కొనసాగించాలని భావిస్తే మాత్రం అభిషేక్ శర్మపై వేటు పడే ఛాన్స్‌ గట్టిగానే కనిపిస్తోంది.


Also Read: వింబుల్డన్ ఫైనల్ విజేత ఎవరు? జకోవిచ్ వర్సెస్ అల్కరాస్ ఢీ

ఇందులో బెంచ్ ఆటగాళ్లను ఆడించాలనే ఆలోచన లేకుంటే తుది జట్టులో ఎలాంటి ఛేంజెస్‌ లేకుండా టీమిండియా బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లో బరిలోకి దింపాలనుకుంటే ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్‌పాండే ఉద్వాసనకు గురవుతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్, స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు. చూడాలి మరి ఈ ఆటలో ఎవరికి ఛాన్స్ దక్కనుందో మరెవరికి మరోసారి ఛాన్సు దక్కనుందో.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×