EPAPER

India vs Sri Lanka 3rd ODI: సిరాజ్ తో అన్ని ఓవర్లు అవసరమా?: రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు

India vs Sri Lanka 3rd ODI: సిరాజ్ తో అన్ని ఓవర్లు అవసరమా?: రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు

Rohit’s Captaincy in India vs Sri Lanka 3rd ODI(Sports news in telugu): శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఒక అంశంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. రచ్చరచ్చ అవుతోంది. అదేమిటంటే ఒకరే పేసర్ తో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. అంతవరకు ఓకే. ఆ ఒక్క పేసర్ గా మహ్మద్ సిరాజ్ వచ్చాడు. తనకి సపోర్టుగా స్లో మీడియం పేసర్ అయిన శివమ్ దూబెను తోడుగా ఉంచారు. అక్కడికి కాంబినేషన్ సరిపోయింది. బ్యాలెన్స్ కుదిరింది.


అయితే మ్యాచ్ ప్రారంభమయ్యాక సిరాజ్ ని ప్రత్యర్థులు చితక్కొట్టేస్తున్నారు. అయినా సరే, అదే పనిగా రోహిత్ శర్మ తనకే బౌలింగు ఇవ్వడం, ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతోంది. అంటే జట్టులో ఒక్క పేసర్ ఉంటే, ఇలాగే ఉంటుందని గంభీర్ కి రోహిత్ శర్మ చెప్పదలుచుకున్నాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ సిరాజ్ 9 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి.. భారీగా సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ తీశాడు.

అంటే ఓవర్ కి 8 పరుగులు పైనే ఇచ్చాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. సిరాజ్ కి తోడుగా బౌలింగు చేసిన శివమ్ దూబె 4 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అక్కడ శ్రీలంక బ్యాటర్లు తన బౌలింగులో ఇబ్బంది పడుతుంటే, రోహిత్ శర్మ తనని కంటిన్యూ చేయకుండా.. బౌలింగ్ పై  నియంత్రణ కోల్పోయిన సిరాజ్ తో చేయించాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు అందరి బుర్రలను తొలిచేస్తోంది.


Also Read: పారిస్ ఒలింపిక్స్.. భారత్ ఆటగాళ్లు అక్కడే.. ఆ ఒక్కటి..

మొత్తం 50 ఓవర్లలో ఆ 4 ఓవర్లు తప్ప, అసలు శివమ్ వైపే రోహిత్ చూడలేదు. ఇది ఖచ్చితంగా కెప్టెన్సీ వైఫల్యమే అంటున్నారు. లేదంటే గంభీర్ ముందుగానే ఇన్ స్ట్రక్షన్ ఇచ్చాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే స్పిన్నర్లు బౌలింగు చేసినంత సేపు స్లిప్ లోనే ఉన్న రోహిత్ శర్మ సడన్ గా సిరాజ్ బౌలింగులో వేరే ప్లేస్ కి వెళ్లాడు. అది కూడా కొంప ముంచింది. తను వేసిన సెకండ్ స్పెల్ మొదటి బంతి కరెక్టుగా స్లిప్ లోకి వచ్చింది. అది రిషబ్ పంత్ అందుకోలేక పోయాడు. అదే రోహిత్ ఉండి ఉంటే, వికెట్ దొరికేది.

సిరాజ్ వేసిన అదే ఓవర్ లో శుభ్ మన్ గిల్ కూడా లాంగ్ ఆన్ లో కొద్దిగా స్టడీగా ఉండి ఉంటే క్యాచ్ దొరికేది. అది మిస్ అయ్యింది. సిక్సర్ వెళ్లిపోయింది. ఇలా సిరాజ్ కి ఫీల్డింగ్ వైఫల్యాలతో వికెట్లు రాలేదు. దురదృష్టవశాత్తూ రన్స్ భారీగా ఇచ్చుకున్నాడు. దీంతో మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే సిరాజ్ కి అంత ఈజీ కాదని అంటున్నారు. ఇప్పుడు కెప్టెన్, కోచ్ ఇద్దరూ కలిసి సిరాజ్ భవిష్యత్ తో ఆటలాడారని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×