EPAPER

IND vs SL 1st T20I Highlights: స్టార్ ఆఫ్ ది ప్లేయర్ రియాన్.. తొలి టీ 20లో శ్రీలంకపై ఘన విజయం

IND vs SL 1st T20I Highlights: స్టార్ ఆఫ్ ది ప్లేయర్ రియాన్.. తొలి టీ 20లో  శ్రీలంకపై ఘన విజయం

India vs Sri Lanka 1st T20I Highlights: ఒకొక్కసారి ఒకొక్క మ్యాచ్ లోనే ఒకొక్కరు స్టార్స్ గా మారిపోతారు. అక్కడ అందిన బ్రేక్ నుంచి నిలదొక్కుకుంటే ఇక వెనక్కి తిరిగి చూసుకునే పనే ఉండదు. అలాంటి అవకాశం శ్రీలంకతో జరిగిన టీ 20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ప్లేయర్ రియాన్ పరాగ్ కి వచ్చింది. తను 1.2 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి మ్యాచ్ ని ముగించాడు. అలాగే కొత్త కోచ్ గౌతంగంభీర్ కి టీమ్ ఇండియా శుభారంభంతో స్వాగతం పలికింది. మూడు టీ 20ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.


శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా తొలి టీ 20 మ్యాచ్ పల్లెకెలె స్టేడియంలో జరిగింది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగుకి వచ్చిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీంతో 43 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

వివరాల్లోకి వెళితే 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగు ప్రారంభించిన శ్రీలంకకు ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభాన్నిచ్చారు. ఓవర్ కి 10 రన్ రేట్ తగ్గకుండా స్కోరుని 9 ఓవర్ల వరకు పరుగులెత్తించారు. ఈ బౌలర్, ఆ బౌలర్ అని లేదు. అందరికీ బాగా వడ్డించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఎక్కువ సమర్పించుకున్నాడు.


ఓపెనర్ నిశ్శాంక 48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 79 పరుగులు చేశాడు. తను క్రీజులో ఉన్నంత వరకు భారత్ గెలుస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే తను అవుట్ అయ్యే సమయానికి శ్రీలంక 14.1 ఓవర్లలో 140 పరుగులు చేసింది. అలాంటి వికెట్ ని అక్షర్ పటేల్ తీశాడు. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

అంతకు ముందు మరో ఓపెనర్ కుశాల్ మెండీస్ అయితే ధనాధన్ ఆడాడు. 27 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగులో అవుట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన కుశాల్ పెరీరా (20) కాసేపు నిలిచాడు. కానీ తనని కూడా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు.

Also Read: అమ్మాయి షూటింగులో అదరగొట్టింది.. ఫైనల్ కు చేరిన మనుబాకర్

ఇక అక్కడ నుంచి శ్రీలంక బ్యాటింగు లయ తప్పింది. కమిందు మెండిస్ (12) తప్ప, తర్వాత ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. చివరికి కొత్తగా కెప్టెన్ అయిన చరిత్ అసలంక తొలి మ్యాచ్ లోనే డక్ అవుట్ అయ్యాడు. ఇక దశున్ శంకర (0)ను మహ్మద్ సిరాజ్ రన్ అవుట్ చేశాడు.

ఆ సమయంలో 17వ ఓవర్ ను కెప్టెన్ సూర్యకుమార్.. కొత్త బౌలర్ రియాన్ పరాగ్ కి ఇచ్చాడు. అందరికీ షాక్. ఎందుకంటే అప్పటికి శ్రీలంక 24 బంతుల్లో 54 పరుగులు చేయాలి. ఇంకా చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. అవతల వైపు కమిందు మెండిస్ క్రీజులో ఉన్నాడు.

రియాన్ పరాగ్ బౌలింగు వేశాడు. అలా 4 బంతికి కమిందు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అంతే ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కసారి మ్యాచ్ సంపూర్ణంగా టీమ్ ఇండియా చేతిలోకి వచ్చేసింది. ఒక దశలో ఒక వికెట్ నష్టానికి 140 పరుగులతో పటిష్టంగా ఉన్న శ్రీలంక ఒక్కసారి 6 వికెట్ల నష్టానికి 161 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అలా రియాన్ ఆ ఓవర్ లో 5 పరుగులిచ్చి, శ్రీలంక కి టెన్షన్ పెంచాడు. టీమ్ ఇండియాకి తగ్గించాడు.

తర్వాత ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ హసరంగ (2) ను అర్షదీప్ అవుట్ చేశాడు. తర్వాత పతిరణ (6) వికెట్ ను సిరాజ్ తీశాడు. అప్పటికి 8 వికెట్ల నష్టానికి 170 పరుగులతో నిలిచింది. చివరి ఓవర్ అనూహ్యంగా మళ్లీ సూర్యకుమార్ తీసుకెళ్లి రియాన్ చేతిలో పెట్టాడు. తను ఓవర్ మొదలుపెట్టి రెండు బంతుల్లో మిగిలిన 2 వికెట్లు తీశాడు. అది కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. అలా ఓవర్ నైట్ ఒక్క మ్యాచ్ తో హీరో అయిపోయాడు. చివరికి శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.

అయితే 16 ఓవర్ వేస్తుండగా రవి బిష్ణోయ్ క్యాచ్ పట్టుకుంటూ గాయపడ్డాడు. కంటికి బాల్ గట్టిగా తగిలి గాయమైంది. అయితే అలాగే బౌలింగు వేసి వికెట్ తీశాడు.

టీమ్ ఇండియా బౌలింగులో అర్షదీప్ 2, సిరాజ్1, అక్షర్ పటేల్ 2, రవి బిష్ణోయ్ 1, రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశారు.

Also Read: సింధు ఒలింపిక్ చీరపై.. నెట్టింట దుమారం

అంతకుముందు బ్యాటింగు ప్రారంభించిన టీమ్ ఇండియాకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. యశస్వి జైశ్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. మంచి రిథమ్ లో ఉండగా అవుట్ అయి నిరాశగా వెనుతిరిగాడు. శుభ్ మన్ గిల్ కూడా తన సహజత్వానికి భిన్నంగా ఆడాడు. తను కూడా 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అందులో 1 సిక్స్, 6 ఫోర్లున్నాయి. ఇద్దరూ వెంటవెంటనే అయిపోయారు.

అప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్, రిషబ్ పంత్ ధనాధన్ ఆడారు. సూర్యా 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ అయితే 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 49 పరుగులు చేసి, సరిగ్గా హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయిపోయాడు.
తర్వాత అందరూ హిట్టింగ్ చేస్తూ అవుట్ అయిపోయారు.

హార్దిక్ (9), రియాన్ పరాగ్ (7), రింకూ సింగ్ (1) ఇలా అయిపోయారు. ఇక అక్షర్ పటేల్ (10 నాటౌట్), అర్షదీప్ (1 నాటౌట్ ) తో నిలిచారు. చివరికి టీమ్ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

శ్రీలంక బౌలింగులో పతిరణ 4, హసరంగ 1, అసిథా ఫెర్నాండో 1, దిశాన్ మధుశంక 1 వికెట్ పడగొట్టారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×