EPAPER

India Vs New Zealand: నువ్వా?.. నేనా?

India Vs New Zealand: నువ్వా?.. నేనా?

India Vs New Zealand: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ … టెన్షన్ టెన్షన్. రెండు సమవుజ్జీల మధ్య పోరు అంటే ఒప్పుకోడానికి బాగుందా? అంటే తప్పదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ లో వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో విజయభేరి మోగించిన జట్లు రెండే ఉన్నాయి. ఒకటి ఇండియా, రెండు న్యూజిలాండ్…ఇప్పుడీ రెండు జట్ల మధ్య పోటీ జరగనుంది. మరి అదెంత మజాగా ఉంటుంది? చెప్పండి…


ఇప్పుడందరి దృష్టి న్యూజిలాండ్-ఇండియా మధ్య జరిగే మ్యాచ్ పైనే ఉంది. ఎవరు ఎవరిని ఓడిస్తారనేది సస్పెన్స్ గా ఉంది. అంతే కాదు టెన్షన్ టెన్షన్ గా కూడా ఉంది.
న్యూజిలాండ్ అనేసరికి అభిమానులు అందరికి 2019లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ గుర్తొస్తుంది. ఎందుకంటే అప్పటికి వరుసగా 5 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ…ఒంటి చేత్తో ఇండియన్ టీమ్ ని సెమీస్ కి తీసుకువెళ్లాడు.

అలాంటిది సరిగ్గా న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో 1 పరుగు చేసి రెండో ఓవర్ లో అయిపోయాడు. ఆ వెంటనే కొహ్లీ కూడా ఒకటే పరుగు చేసి మూడో ఓవర్ లో అయిపోయాడు. తర్వాత కేఎల్ రాహుల్ వంతు. తను కూడా ఒకటే పరుగు… డకౌట్లు అంటే మరీ బాగుండదని మనవాళ్లు ఒకొక్క పరుగే చేసినట్టున్నారు. సరిగ్గా 3 ఓవర్లు అయ్యాయో లేదో 5 పరుగులకి 3 వికెట్లతో మన సెమీఫైనల్ అలా మొదలైంది.


24 పరుగుల వద్ద హార్డ్ హిట్టర్ కార్తీక్ అయిపోయాడు. 71 పరుగుల వద్ద మన చిచ్చరపిడుగు రిషబ్ పంత్ అయి పోయాడు. శిఖర్ ధావన్ ప్లేసులో ప్రత్యేక విమానంలో ఎగురుకుంటూ వచ్చిన పంత్ అంత పని చేశాడు. కీలకమైన సమయంలో అనవసరమైన, నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్టు సమర్పించుకున్నాడు.

ఈ సమయంలో గురుశిష్యులు ధోనీ, జడేజా ఇద్దరూ చివరి వరకు పోరాడారు. జడేజాకి స్ట్రయికింగ్ ఇస్తూ మ్యాచ్ ని ధోనీ ముందుకి నడిపించిన తీరు అతని కెప్టెన్సీ లక్షణాలకి ఒక మచ్చు తునక అని చెప్పాలి. అయితే అప్పుడు తను కెప్టెన్ కాదు. కానీ జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడి తన బాధ్యతను మరొక్కసారి నిరూపించుకున్నాడు. చివరికి 59 బాల్స్ లో 77పరుగులు చేసిన జడేజా అవుట్ అయ్యాడు. తర్వాత 50 పరుగులు చేసి రనౌట్ గా ధోనీ వెనుతిరిగాడు. చివరికి 18 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. అశేష భారత ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది.

అంతేకాదు మన ధనాధన్ ధోనీ కి ప్రపంచకప్ తో ఒక గొప్ప సెండాఫ్ ఇద్దామని అనుకుంటే అది కూడా మిస్ అయ్యింది. అన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడిన ధోనీ ఏనాడు కళ్లనీళ్లు పెట్టుకోలేదు. కానీ తను రనౌట్ అయిన తర్వాత మొదటిసారి ఉద్వేగభరితమై కన్నీటితో అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. అదే ధోనీ అయితే సచిన్ కి 2011 వరల్డ్ కప్ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.

న్యూజిలాండ్ తో అంతటి చేదు అనుభవాలు ఇండియాకి ఉన్నాయి. మరిలాంటి పరిస్థితుల్లో ఆనాటి సెమీస్ లో పగ నేడు మనవాళ్లు తీర్చుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఇకపోతే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న సెమీస్ ను అడ్డుకోవడం భారత్ కి సవాల్ అని చెప్పాలి. కొంతకాలంగా ఐసీసీ టోర్నీలో టీమ్ ఇండియాపై న్యూజిలండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది కొద్దిగా టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన విషయంగానే ఉంది.

అయితే ఇండియా టాప్ ఆర్డర్ కూడా బలంగానే ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వరుసగా మూడు వికెట్లు పడినప్పటికి కొహ్లీ, రాహుల్ ఎలా మ్యాచ్ ని ముందుకు తీసుకువెళ్లారో అందరికీ తెలిసిందే. అలాగే నాలుగు మ్యాచుల్లో కూడా ఐదో వికెట్ పడకుండానే అన్నింటినీ ముగించారు. గిల్ ఆకట్టుకుంటున్నాడు. శ్రేయాస్ అప్పుడప్పుడు విఫలమవుతున్నా వన్డే ప్లేయర్ కి కావల్సిన ఆయుధాలన్నీ తనదగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు సిక్సర్లు కొడుతున్నాడు. ఫోర్లు కూడా దంచుతున్నాడు. లోయర్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి జడేజా ఎలాగూ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా లేని లోటు కనిపిస్తోంది కానీ తను అవసరం రాకుండానే బంగ్లాదేశ్ పై గెలిచాం.

ఒకరకంగా చెప్పాలంటే రోహిత్, గిల్, కొహ్లీ, రాహుల్, శ్రేయాస్ అందరూ బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నారు. మరి వీరిని అడ్డుకోవడం న్యూజిలాండ్ బౌలర్లకి సాధ్యమేనా? అన్నది ప్రశ్నగా ఉంది. అలాగే ఎంతటి డ్రై పిచ్ మీదనైనా మనవాళ్లు వికెట్లు తీస్తున్నారు. ప్రత్యర్థులను 270కి మించనివ్వడం లేదు. ఆఫ్గాన్ పై 272 పరుగుల స్కోరుని మనవాళ్లు 35 ఓవర్లలో కొట్టి పారేశారు.

కివీస్ విషయానికి వస్తే 2015, 2019 లో ఫైనల్ కి చేరినా కప్ సాధించలేకపోయింది. ఈసారి ఎలాగైనా కప్ తో వెళ్లాలని చూస్తోంది. డేవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ బాగా ఆడుతున్నారు. బౌలింగ్ లో కూడా ఫెర్గూసన్, శాంటర్న్, హెన్రీ ముగ్గురూ వికెట్లు తీస్తున్నారు. లేదంటే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు.

ఇలా అన్నిరకాలుగా సమవుజ్జీలుగా ఉన్న ఇండియా-న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 22న హిమాచల్ ప్రదేశ్ లోని హెచ్ పీ సీఏ స్టేడియంలో జరగనుంది. చివరికి ఎవరు మొనగాళ్లు అనేది తేలిపోతుంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×