EPAPER

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: టీమిండియా ( Team India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand) జట్ల మధ్య… ఇవాల్టి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ కాసేపటికి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ జట్టు… మొదటి బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది రోహిత్ సేన. ముందుగా చెప్పినట్లుగానే టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకుంది. మహారాష్ట్రలోని పూణే (Pune )అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ 9:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే రెండవ టెస్టులో కీలక మార్పులు చేసింది టీమిండియా.


India vs New Zealan KL Rahul Kuldeep Siraj dropped NZ opt to bat in Pune
India vs New Zealan KL Rahul Kuldeep Siraj dropped NZ opt to bat in Pune

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

మొదటి టెస్ట్ మ్యాచ్లో విఫలమైన కేఎల్ రాహుల్ ను (Kl Rahul) సైడ్ చేశారు రోహిత్ శర్మ (Rohit Sharma). కేల్ రాహుల్ స్థానంలో జట్టులోకి గిల్ (Gill ) వచ్చాడు. ఇక మహమ్మద్ సిరాజ్ స్థానంలో… ఆకాశ్ దీప్ జట్టులోకి రావడం జరిగింది. కొత్తగా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులోకి రావడం జరిగింది. అటు న్యూజిలాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.


 

రెండో టెస్టులో మూడు మార్పులతో టీమిండియా

చైనా మ్యాన్ కుల్దీప్ యాదవ్ పై వేటు వేసి… ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. ఇక kl రాహుల్ స్థానంలో గిల్ తుది జట్టులో ఉన్నాడు.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×