EPAPER

India vs England : తగ్గేదేలే..అంటున్న ఇండియా.. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి

India vs England : తగ్గేదేలే..అంటున్న ఇండియా.. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి

India vs England : వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియా… ఇంగ్లండ్ తో ఎలా ఆడుతుందిరా…భగవంతుడా!
 అని అంతా అనుకున్నారు.. ఇన్నిమ్యాచ్ ల్లో మొదట బౌలింగ్ చేసి, తర్వాత ఛేజింగ్ లో  లక్ష్యాన్ని సాధించి ఇండియా గెలుస్తూ వచ్చింది. కానీ ఇంగ్లండ్ తో మొదటిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఎర్రమట్టి నేలపై కఠినమైన పిచ్ పై టీమ్ ఇండియా కూడా పడుతూ లేస్తూనే బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్ తో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ సహకారంతో 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండు ముందు ఉంచింది.


చిన్నదే లక్ష్యం కాబట్టి, ఆడుతూ పాడుతూ ఇంగ్లండ్ కొట్టేస్తారని అనుకున్నారు…కానీ అప్పుడే మన ఇండియన్ బౌలర్లు షమీ, బుమ్రా వణికించారు. దీంతో ఇంగ్లండ్ 129 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 100 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించి సగౌర్వంగా సెమీస్ లో అడుగుపెట్టింది.

వన్డే వరల్డ్ కప్ 2023 క్రికెట్ లో భాగంగా లఖ్ నవ్ లో జరిగిన ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇంతవరకు ఒక్క ఓటమి కూడా ఎరుగని ఇండియా వరుస విజయాలతో సెమీస్ ముంగిట అడుగుపెట్టింది.


మ్యాచ్ వివరాల్లోకి వెళితే… టాస్ గెలిచిన ఇంగ్లండ్ తెలివిగా ఇండియాను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఇంతకాలం ఛేజింగ్ లో గెలుస్తూ వచ్చిన ఇండియా వరల్డ్ కప్ లో తొలిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. మొత్తానికి పిచ్ ప్రభావమో ఏమో తెలీదుగానీ..ఇంగ్లండ్  వ్యూహమో గానీ వారి ఆలోచన పనిచేసింది. 40 పరుగులకి ఇండియా 3 కీలక వికెట్లు కోల్పోయింది. కొహ్లీ డక్ అవుట్ కావడం సెన్సేషన్  అయ్యింది.

ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మొదట నెమ్మదిగానే ఆడారు. 3 ఓవర్ చివరి బంతికి గిల్ (9) అవుట్ అయ్యాడు. తర్వాత 6 ఓవర్ ఆఖరి బంతికి కోహ్లీ (0) అవుట్ అయ్యాడు. ఇన్నాళ్లకి అవకాశం వచ్చింది… ఆదుకుంటాడనుకున్న శ్రేయాస్ అయ్యర్ (4) తను చేతులెత్తేశాడు. ఆ సమయంలో బాధ్యతను రోహిత్ తన భుజాలపై వేసుకున్నాడు.

తన స్వభావానికి పూర్తి విరుద్ధంగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నట్టు కనిపించాడు. కేఎల్ రాహుల్ తో కలిసి అడపాదడపా ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డుని ముందుకి కదిలించారు. 66 బంతుల్లో రోహిత్ శర్మ ఆఫ్ సెంచరీ చేశాడంటే తనెలా బ్యాటింగ్ చేశాడో అర్థమవుతుంది. అప్పటికి ఇండియా 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. హమ్మయ్యా…ఇక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తరహాలో ధనాధన్ కొడతారనుకునే టైమ్ లో విల్లీ బౌలింగ్ లో రాహుల్ అవుట్ అయ్యాడు.

ఈ టైమ్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా తన సహజశైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేస్తూ కెప్టెన్ రోహిత్ కి తన సహాయ సహకారాలు అందించాడు. వీరిద్దరూ ఉండగా స్కోరు 280 పరుగులైనా చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ భారీ షాట్ కి ట్రై చేసిన రోహిత్ శర్మ 87 పరుగులు చేసి మళ్లీ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. 3 సిక్స్ లు, 10 ఫోర్లతో నడిచిన కెప్టెన్ కథ  అలా ఇండియా 164 పరుగుల వద్ద ముగిసింది.

తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇక బ్యాట్ ఝులిపిస్తాడని అనుకునే సమయంలో 49 పరుగులు చేసి తను అవుట్ అయిపోయాడు. ఈ దశలో జడేజా (8), షమీ (1)  అవుట్ కావడంతో ఇండియా కనీసం 200 పరుగులైనా చేస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా (16), కులదీప్ (9) నాటౌట్ గా ఉండటంతో 229 పరుగుల వద్ద ఇండియా ఆగిపోయింది. ఇంగ్లండ్ బౌలింగ్ లో డేవిడ్ విల్లీ 3, క్రిస్ ఓక్స్ 2, ఆదిల్ రషీద్ 2, మార్క్ వుడ్ 1 వికెట్టు తీశారు.

తర్వాత ఛేజింగ్ కి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు మొదట్లో సాఫీగానే బండిని కదిలించారు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ గాడిన పడకపోవడంతో తనకి బాగా తగలించారు. 4 ఓవర్లు గడిచేసరికి ఇంగ్లండ్ 26 పరుగులతో లక్ష్యం దిశగా సాగిపోతున్నట్టే కనిపించింది. అప్పుడు 5వ ఓవర్ లో బూమ్రా మ్యాజిక్ పనిచేసింది. ఆ ఓవర్ 5 బంతికి డేవిడ్ మలన్ (16) అవుట్ అయ్యాడు. తర్వాత బంతికే జోయ్ రూట్ సున్నాకే అయిపోయాడు. అలా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి ఇండియా జట్టుని బతికించాడు.

ఆ తర్వాత ఓవర్ లో షమీ వచ్చాడు. ఆ బాల్స్ కి, ఆ వేగానికి ఇంగ్లండ్ చిగురుటాకులా వణికిపోయింది. ప్రతీ బాల్ కి షమీ వికెట్ తీస్తున్నట్టుగానే కనిపించాడు.అలా ఫస్ట్ ఓవర్ లోనే బెయిర్ స్టో వికెట్ తీశాడు. అప్పటికి 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

అప్పుడు జనం అనుకున్నారు. ఎర్రమట్టితో నిండిన ఈ పిచ్ పై ఆడటం చాలా కష్టం. మనవాళ్లు అందుకే అవుట్ అయిపోయారని భావించారు. తర్వాత ఇంగ్లండ్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. జాస్ బట్లర్ (10), మొయిన్ అలీ (15), లివింగ్ స్టోన్ (27), క్రిస్ ఓక్స్ (10), డేవిడ్ వాలీ (16), ఆదిల్ రషీద్ (13) , మార్క్ వుడ్ (0) ఇలా అందరూ క్యూ కట్టేశారు. మొత్తానికి 129 పరుగుల వద్ద ఇంగ్లండ్ కథని మన బౌలర్లు ముగించేశారు. అలా 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

అరవీరభయంకరంగా నిప్పులు కురిపించే బంతులు వేసిన షమీకి 4 వికెట్లు, బెంబేలెత్తిస్తూ బౌలింగ్ చేసిన బూమ్రాకి 3 వికెట్లు, మధ్యలో స్పిన్ చేసి ఇంగ్లండ్ నడ్డివిరిచిన కులదీప్ 2 వికెట్లు పడ్డాయి. జడేజా 1 వికెట్టు తీసుకున్నాడు. అతి కఠినమైన పిచ్ పై విలువైన పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడిన కెప్టెన్ రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తానికి అప్రతిహితంగా సాగిపోతున్న ఇండియా మున్ముందు కూడా ఇలాగే వరుస విజయాలు సాధించి 2023 వరల్డ్ కప్ తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×