EPAPER

India Vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా 219/7..

India Vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా 219/7..

 


India Vs England 4th Test
India Vs England 4th Test

India vs England Fourth Test Updates: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కీపర్ జురెల్ (30*), కుల్దీప్ యాదవ్(17*) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రూట్(122*) పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓలీ రాబిన్‌సన్(58) టెస్ట్ కెరీర్‌లో తొలి అర్థ సెంచరీ సాధించారు. ఒకే ఓవర్లో రాబిన్‌సన్, బషీర్ వికెట్లు తీసిన జడేజా ఆ తర్వాత ఓవర్లో అండర్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇండియా బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు.


Read More: ముగిసిన తొలిరోజు ఆట.. రూట్ సెంచరీ.. ఇంగ్లాండ్ 302/7..

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులు మాత్రమే చేసి అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ ఫోక్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించిన తర్వాత శుభ్‌మన్ గిల్(38) బషీర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పటీదార్(17), జడేజా(12) బషీర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. హాఫ్ సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్ బషీర్ బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. సర్ఫరాజ్ ఖాన్ (14) టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్(1) టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 4, టామ్ హార్ట్లీ 2, అండర్సన్ ఒక వికెట్ తీసుకున్నారు.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×