EPAPER

India Won 3rd Test: రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ విలవిల.. రికార్డు విజయం నమోదు చేసిన భారత్!

India Won 3rd Test: రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ విలవిల.. రికార్డు విజయం నమోదు చేసిన భారత్!
sports news in telugu

India Beats England in 3rd Test: ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియా ఘనవిజయం సాధించింది. 557 పరుగుల భారీ టార్గెట్ తో దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో గెలిచింది. జడేజా 5 వికెట్లుతీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. కులదీప్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. తిరిగి జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ , జస్ ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు.


అంతుకుముదు 196/2 ఓవర్ నైట్ స్కోర్ తో 4వ రోజు ఆట ప్రారంభించిన రోహిత్ సేన అదే జోరు కొనసాగించింది గిల్ ఓవర్ నైట్ స్కోర్ (65 బ్యాటింగ్ ) కు మరో 26 పరుగులు జోడించి రనౌట్ అయ్యాడు. 91 పరుగుల వ్యక్తి స్కోర్ వద్ద శుభ్ మన్ గిల్ పెవిలియన్ చేరి సెంచరీ మిస్ చేసుకున్నాడు. మూడో వికెట్ కు కులదీప్ తో కలిసి 55 పరుగులు జోడించాడు. గిల్ అవుట్ అయ్యే సమయానికి భారత్ స్కోర్ 246 పరుగులు.

ఈ దశలో క్రితం రోజు సెంచరీ తర్వాత రిటర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్ తిరిగి క్రీజులోకి వచ్చాడు. నైట్ వాచ్ మన్ కులదీప్ (27) కూడా పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. జట్టు స్కోర్ 258 పరుగుల వద్ద రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో కులదీప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి యశస్వి జైస్వాల్ భారత్ లీడ్ ను 400 దాటించాడు.


Read More: యశస్వీ ఆట చూస్తుంటే సచిన్ గుర్తొచ్చాడు.. రవిశాస్త్రి..! ఇలాగే చితక్కొట్టేయాలి.. సెహ్వాగ్..!

లంచ్ విరామ సమయానికి టీమిండియా స్కోర్ 314/4. అప్పటికి యశస్వి జైస్వాల్ (149 బ్యాటింగ్ ), సర్ఫరాజ్ ఖాన్ ( 22 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ దూకుడుగా ఆడారు . ముఖ్యంగా జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో డబుల్ సెంచరీ చేశాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ కూడా బాగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో భారత్ ఆధిక్యం 500 పరుగులు దాటింది.

విశాఖలో జరిగిన రెండో టెస్టులోనూ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో ఈ పీట్ సాధించాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలతో రికార్డు సృష్టించాడు.

భారత్ జట్టు స్కోర్ 430 పరుగుల రెండో ఇన్నింగ్స్ ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు. దీంతో భారత్ కు 556 పరుగుల లీడ్ లభించింది. ఇంగ్లాండ్ ముందు 557 టార్గెట్ ను ఉంచింది. భారత్ డిక్లేర్ చేసే సమయానికి జైస్వాల్ ( 214 నాటౌట్, 14 ఫోర్లు, 12 సిక్సులు ), సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్ ) అజేయంగా నిలిచారు. ఈ జోడి 5వ వికెట్ కు 172 పరుగులు జోడించారు.

557 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన ఇంగ్లాండ్ తడబడింది. 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ బెన్ డెక్కెట్ రనౌట్ అయ్యాడు. చివరల్లో బౌలర్ మార్క్ వుడ్ (33, 15 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్) ధనా ధనా దంచడంతో ఇంగ్లాండ్ స్కోర్ వంద దాటింది. చివరి 122 పరుగుల వద్ద ఇంగ్లాండ్ కథ ముగిసింది. తొలి సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

పరుగుల పరంగా భారత్ టెస్టు కిక్రెట్ చరిత్రలో ఇదే భారీ విజయం. మరోవైపు ఒకే ఇన్నింగ్స్ ఎక్కువ సిక్సులు కొట్టిన భారత్ బ్యాటర్ గా యశస్వి జైస్వాల్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఒక ఇన్నింగ్స్ లో నవ్ జోత్ సింగ్ సిద్ధూ 8 సిక్సులు కొట్టాడు. ఆ రికార్డును 12 సిక్సులు కొట్టి జైస్వాల్ బ్రేక్ చేశాడు.

సిరీస్ లో 2-1 లీడ్ లో ఉంది టీమిండియా. హైదరాబాద్ లో జరిగిన తొలిటెస్టులో ఇంగ్లాంగ్ గెలిచింది. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు భారత్ విజయం సాధించింది.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×