EPAPER

Ind vs Ban T20: ఉప్పల్‌‌లో టీమ్ ఇండియా ఉతుకుడు.. బంగ్లాకు భారీ టార్గెట్, ఆ వరల్డ్ రికార్డు జస్ట్ మిస్!

Ind vs Ban T20: ఉప్పల్‌‌లో టీమ్ ఇండియా ఉతుకుడు.. బంగ్లాకు భారీ టార్గెట్, ఆ వరల్డ్ రికార్డు జస్ట్ మిస్!

INDIA vs BAN :  భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆఖరి టీ20 సమరంలో టీమిండియా రెచ్చిపోయింది. ప్రత్యర్థి బంగ్లాపై విరుచుకుపడింది. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. హైదరాబాద్‌ ఉప్పల్’లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20లో భారత బ్యాట్స్ మెన్లు బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు.


సంజూ శాంసన్‌ వీరబాదుడు…

అంతర్జాతీయ టీ20 చరిత్రలోనే రెండో అతిభారీ స్కోర్‌ నమోదు చేసింది టీమిండియా. సంజూ శాంసన్‌ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర విన్యాసాలకు, సూర్యకుమార్‌ యాదవ్‌ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు తొడవడంతో స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ చివర్లో హార్దిక్‌ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (13 బంతుల్లో 34; ఫోర్‌, 4 సిక్సర్లు) ఫలితంగా ఆల్ టైమ్ రికార్డు స్కోరు నమోదైంది. 13 ఓవర్లు ముగిసే సరికే భారత్ స్కోరు 190 దాటి ఔరా అనిపించింది. ఒకదశలో టీమ్ స్కోరు 300 పక్కాగా దాటి టీ20ల్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అవుతుందా అని అనిపించింది.

ఇప్పటి వరకు టీ20ల్లో రికార్డులు బద్దలుకొట్టిన జట్ల వివరాలివే…


1. నేపాల్ 314/3 vs మంగోలియా-2023

2. భారత్ 297/6 vs బంగ్లాదేశ్ – 2024

3. అఫ్గానిస్తాన్ 278/3 vs ఐర్లాండ్-2019

4. జెచ్ రిపబ్లిక్ 2784 టర్కీ-2019

5. మలేషియా 268/4 vs థాయిలాండ్ – 2023

6. ఇంగ్లాండ్ 267/3 vs వెస్టిండీస్ – 2023

7. ఆస్ట్రేలియా 263/3 vs శ్రీలంక – 2016

8. శ్రీలంక 260/6 vs కెన్య – 2007

9. భారత్ 260/5 vs శ్రీలంక – 2017

10. దక్షిణాఫ్రికా 259/4 vs వెస్టిండీస్ – 2023

మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ లోనూ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో భారత్ క్వీన్ స్వీప్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఫ్యాన్స్ కుషి అవుతున్నారు.

టీమిండియా రికార్డ్ బ్రేకింగ్ :

T20Iలో బెస్ట్ పవర్ ప్లే స్కోర్ – 82/1.

వేగవంతమైన టీమ్ 100 – 7.1 ఓవర్లు

మొదట 10 ఓవర్లలో బెస్ట్ స్కోర్ – 146/1

T20Iలో ఇండియన్’కి రెండో ఫాస్టెస్ట్ సెంచరీ

వేగవంతమైన టీమ్ 200 – 14.0 ఓవర్లు

T20Iలో టీమిండియా అత్యధిక స్కోర్ – 297 /6

T20Iలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బౌండరీలు 47 (22 సిక్సులు, 25 ఫోర్లు).

టీమ్ స్క్వాడ్…

భారత్ : సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్ (కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్.

Also Read : పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

Related News

Ind vs Ban T20i : భారత్ క్లీన్ స్వీప్… మూడో టీ20లోనూ ఘన విజయం, సిరీస్ కైవసం

India vs Bangladesh : సంజు ఫాస్టెస్ట్ సెంచురీ.. ఆ ఒక్క ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు, బంగ్లా బెంబేలు!

Ind Vs Nz: న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ గా అతడికి చాన్స్!

Ajay Jadeja Jamnagar: ఆ రాజ్యానికి వారసుడిగా క్రికెటర్ అజయ్ జడేజా.. అధికారికంగా ప్రకటించిన రాజుగారు

Ind vs Ban: ఇవాళ హైదరాబాద్ లో మూడో టి20.. తెలుగు ప్లేయర్లకు అవకాశం!

Mohammad Siraj: మహమ్మద్ సిరాజ్‍‌కు DSP పోస్ట్..!

Big Stories

×