EPAPER

India vs Bangladesh : సంజు ఫాస్టెస్ట్ సెంచురీ.. ఆ ఒక్క ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు, బంగ్లా బెంబేలు!

India vs Bangladesh : సంజు ఫాస్టెస్ట్ సెంచురీ.. ఆ ఒక్క ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు, బంగ్లా బెంబేలు!

India vs Bangladesh : హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు చెలరేగి ఆడేశారు. భారత్ జట్టు బంగ్లా ముందు భారీ స్కోరును ఉంచింది. సంజు సామ్సన్ 47 బంతుల్లో 111 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు.


మ్యాచ్ ప్రారంభం నుంచి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా చెలరేగిపోయింది. సూర్య కుమార్ యాదవ్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి ఆడాడు. అభిషేక్ శర్మ నాలుగు పరుగులకే వెను తిరగగా… సూర్య కుమార్ యాదవ్, సంజు సామ్సన్ బంగ్లా ఆటగాళ్లకు ఓ రేంజ్ లో చుక్కలు చూపించారు. ఇక రిషద్ వేసిన పదో ఓవర్ లో సంజు ఏకంగా 30 పరుగులు చేశాడు. రెండో బంతి మినహా ఆ ఓవర్ లో అన్ని బంతులను సిక్సర్ల బాట పట్టించి 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆఖరిలో రియాన్ పరాగ్ 34, హార్దిక్ పాండ్యా 47 పరుగులు చేశారు. నితీష్ రెడ్డి డక్ అవుట్ గా వెనుతిరగగా.. రికు సింగ్ 8 పరుగులకు నాటౌట్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో షాకీబ్ 3, టస్కిన్, ముస్తాఫిజూర్, మహమ్మదుల్లా ఒక్కో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్లో సంజు సాంసంగ్ 40 పంతుల్లో సెంచరీ చేసి రికార్డు కొల్లగొట్టాడు. ఇక పదో ఓవర్ లో సంజు ఏకంగా 5 సిక్స్ లు బాదేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ 30 బంతుల్లో 65 పరుగులు చేసి దూకుడుగా ఆడేసాడు. దీంతో భారత్ 12.1 ఓవర్లు పూర్తయ్యే సరికి కేవలం ఒక వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేసి అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా అరుదైన రికార్డును సృష్టించాడు.


ALSO READ : ఉప్పల్‌‌లో టీమ్ ఇండియా ఉతుకుడు.. బంగ్లాకు భారీ టార్గెట్, ఆ వరల్డ్ రికార్డు జస్ట్ మిస్!

ఇక టి20 మ్యాచ్ లో అత్యంత వేగంగా శతకాలు చేసిన వారిలో డేవిడ్ మిల్లర్ (35), రోహిత్ శర్మ (35) జాన్స్ అండ్ చార్లెస్ (39) బంతులతో తొలి మూడు స్థానాల్లో ఉండగా సంజు 40 పంతుల్లో శతకంతో నాలుగు స్థానంలో నిలిచాడు.

ఇండియన్ మెన్స్ ప్లేయర్ టీ 20 మ్యాచ్ లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ప్లేయర్స్ లో 35 పరుగుల్లో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉండగా… 40 బంతుల్లో సెంచరీ చేసి సంజు సాంసన్ రెండో స్థానంలో నిలిచాడు. సూర్య కుమార్ యాదవ్ 45 బంతుల్లో సెంచరీ చేయగా… అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇక కేఎల్ రాహుల్ 46 బంతుల్లో సెంచరీ కొల్లగొట్టాడు.

Related News

Ind vs Ban T20i : భారత్ క్లీన్ స్వీప్… మూడో టీ20లోనూ ఘన విజయం, సిరీస్ కైవసం

Ind vs Ban T20: ఉప్పల్‌‌లో టీమ్ ఇండియా ఉతుకుడు.. బంగ్లాకు భారీ టార్గెట్, ఆ వరల్డ్ రికార్డు జస్ట్ మిస్!

Ind Vs Nz: న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ గా అతడికి చాన్స్!

Ajay Jadeja Jamnagar: ఆ రాజ్యానికి వారసుడిగా క్రికెటర్ అజయ్ జడేజా.. అధికారికంగా ప్రకటించిన రాజుగారు

Ind vs Ban: ఇవాళ హైదరాబాద్ లో మూడో టి20.. తెలుగు ప్లేయర్లకు అవకాశం!

Mohammad Siraj: మహమ్మద్ సిరాజ్‍‌కు DSP పోస్ట్..!

Big Stories

×