EPAPER

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!
Virat Kohli 1st Net Practice Today In Chennai : విరాట్ కోహ్లీ బ్యాటింగులో ఒక రిథమ్ ఉంటుంది. ప్రభుదేవా పాటకు తగినట్టుగా స్టెప్ ఎలా వేస్తాడో.. విరాట్ బ్యాటింగ్ లో కూడా ఒక లయ ఉంటుంది. అందునా కవర్ డ్రైవ్స్ చూడముచ్చటగా ఉంటాయి. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్ చూస్తూ కరెక్టుగా బ్యాట్ ని తిప్పుతూ ఎంతో క్లాసిక్ ప్లే ఆడతాడు. అలాంటి వాడు ఇటీవల సడన్ గా గాడి తప్పాడు.

తన నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలమై పోయింది. టీ 20 2024 ప్రపంచకప్ లో కూడా ఫైనల్ మ్యాచ్ లో తప్ప.. ముందన్ని మ్యాచ్ లు దారుణంగా ఆడాడు. అంతేకాదు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా పెద్ద గా ఆకట్టుకోలేదు. మూడు వన్డేలు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మిగిలినవాళ్లు అంతకంతేలా ఆడారు.


ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్ లో మరెలా ఆడతాడనే సంధిగ్ధత అందరిలో ఉంది. అయితే తను చెన్నైలో జరిగే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు . 45 నిమిషాలు మాత్రమే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మరి తొలిటెస్టు తర్వాత చూసి, అప్పుడు కావాలంటే ప్రాక్టీస్ పెంచుదామని అనుకున్నాడో ఏమో తెలీదు.

నెట్ సెషన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్, రిషబ్ పంత్,  అశ్విన్, కులదీప్, సిరాజ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తదితరులు పాల్గొన్నారు. బీసీసీఐ వీరి ప్రాక్టీస్ సెషన్ వీడియోను నెట్టింట షేర్ చేసింది. అయితే కోహ్లీకి చెన్నైలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడి 267 పరుగులు చేశాడు.


Also Read: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

అంతేకాదు విరాట్ కానీ, ఈ తొలిటెస్టులో మరో 58 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ పేరిట ఉంది. అయితే తనకి ఇన్ని పరుగులు చేయడానికి 623 ఇన్నింగ్స్‌లు పట్టింది.

ఒకవేళ  కోహ్లీ గానీ, ఈ టెస్టు మ్యాచ్ లో ఆ 58 పరుగులు చేస్తే..  600 ఇన్నింగ్స్‌ లోపే ఆ ఘనత సాధించిన క్రికెటర్ అవుతాడు. కొహ్లీకన్నా ముందు రికీ పాంటింగ్ 27,483, కుమార సంగక్కర 28,016 ఉన్నారు. వీరందరికన్నా పైన గాడ్ ఆఫ్ ది క్రికెట్ సచిన్ 34,357 పరుగులతో ఉన్నాడు.

కొహ్లీ చివరిసారి 2023 వన్డే ప్రపంచకప్ లో 50వ సెంచరీ చేశాడు. దాంతో సచిన్ 49 వన్డేల రికార్డును అధిగమించాడు. ఇక టెస్టు సెంచరీ గురించి చెప్పాలంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ పై 2023లో చేశాడు. ఇప్పటికే సంవత్సరన్నర దాటిపోతోంది. అందుకే బంగ్లాదేశ్ తో జరిగే తొలిటెస్టులో కొహ్లీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి అందుకుంటాడా? లేదా? చూడాల్సిందే.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×