EPAPER

IND vs AUS 2nd T20 : ఆసీస్ ను మళ్లీ ఉతికి ఆరేశారు.. రెండో టీ 20లో టీమ్ ఇండియా ఘన విజయం!

IND vs AUS 2nd T20 : ఆసీస్ ను మళ్లీ ఉతికి ఆరేశారు.. రెండో టీ 20లో టీమ్ ఇండియా ఘన విజయం!
IND vs AUS 2nd T20

IND vs AUS 2nd T20 : మొదటి టీ 20 మ్యాచ్ ఏదో గాలివాటంగా గెలిచారని అనుకున్నవాళ్లకి.. టీమ్ ఇండియా కుర్రాళ్లు సరైన సమాధానమిచ్చారు. సీనియర్లకు ఏ మాత్రం తీసిపోమని ఒక రేంజ్ లో సమాధానమిచ్చారు. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో  జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో మన కుర్రాళ్లు ఆసీస్‌ను ఉతికి ఆరేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే చితక్కొట్టి పడేశారు.


మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లకి 235 పరుగులు చేసింది. బదులుగా ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 44 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చిన టీమ్ ఇండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ , రుత్ రాజ్ గైక్వాడ్ చెరో ఆఫ్ సెంచరీతో అదరగొట్టారు. 5.5 ఓవర్లలో 77 పరుగులకి మ్యాచ్ ని బుల్లెట్ స్పీడ్ తో తీసుకెళ్లారు. యశస్వి జైస్వాల్ కేవలం 25 బంతుల్లో 2 సిక్స్ లు, 9 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఒక ఆఫ్ సెంచరీ చేసుకున్నాడు. తను కూడా కేవలం 32 బంతుల్లోనే 4 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 15.2 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది.  సెకండ్ డౌన్ వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 2 సిక్స్ లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. కానీ 19 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు.


మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 2 సిక్స్ లు, 3 ఫోర్లు సాయంతో 43 బంతుల్లో 58 పరుగులు చేసిన అనంతరం తను అవుట్ అయిపోయాడు. అప్పటికి స్కోరు 19.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు. అప్పటికే కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేసి రింకూ సింగ్ దంచి కొట్టి నాటౌట్ గా నిలిచాడు. ఆ సమయంలో తనకింకా ఓవర్లు ఉండి ఉంటే, అతితక్కువ బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసే రికార్డ్ వచ్చేదేమో అనుకున్నారు. అంత విధ్వంసం సృష్టించాడు. చివర్లో తిలక్ వర్మ (7) నాటౌట్ గా నిలిచాడు.

మొత్తానికి 4 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో టీమ్ ఇండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బౌలింగ్ లో నాథన్ ఎలిస్ 3, స్టోయినిస్ కు ఒక వికెట్ దక్కింది. 236 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ ఆరంభంలో అదరగొట్టింది.  మొదటి రెండు ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. అందరిలో ఆందోళన మొదలైంది. వీళ్లూ ఇరగ్గొడుతున్నారుగా అనుకున్నారు. అప్పుడే సూర్య కెప్టెన్సీలో మ్యాజిక్ జరిగింది.

రవి బిష్ణోయ్ కి బాల్ ఇచ్చాడు. మూడో ఓవర్ లోనే కొత్త బౌలర్ ని తీసుకురావడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. తను కెప్టెన్ మాటను వమ్ము చేయలేదు. మాథ్యూ షార్ట్ (19) ని అవుట్ చేశాడు. మళ్లీ మరో ఓవర్ కి వచ్చాడు. ఈసారి మొదటి టీ20లో సెంచరీ చేసిన జోష్ ఇంగ్లిస్ (2) ని సాగనంపాడు. 4.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఆసీస్ 39 పరుగుల మీద ఉంది.

తర్వాత విధ్వంస వీరుడు మ్యాక్స్ వెల్ (12) ని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 53 పరుగుల వద్ద తను పెవిలియన్ చేరాడు. తర్వాత కుదురుగా ఆడుతున్నాడని అనుకుంటున్న స్టీవ్ స్మిత్ (19) ని ప్రసిద్ధ క్రష్ణ అవుట్ చేశాడు. ఇలా ఎక్కడా కూడా ఆసీస్ బ్యాటర్లను టీమ్ ఇండియా బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు.

7.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 58 పరుగులతో కష్టాల కడలిలో ఆసిస్ ఈదుతోంది. 100 పరుగులకే చాప చుట్టేస్తుందని అంతా అనుకున్నారు. కానీ మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ ఇద్దరూ అల్లాడించారు. మామూలుగా కాదు టీమ్ ఇండియా కుర్రాళ్లకి చుక్కలు చూపించారు. కొడితే బాల్ వెళ్లి ఎక్కడో స్టేడియం మధ్యలో పడేది. ఒక దశలో ఇద్దరూ కలిసి లక్ష్యాన్ని చేధించేలాగే కనిపించారు.

అప్పటికి 13.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగుల మీద ఆసీస్ ఉంది. ఈ సమయంలో రవి బిష్ణోయ్ బ్రేక్ ఇచ్చాడు. టిమ్ డేవిడ్ వికెట్ తీసుకున్నాడు. తను 22 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేసి మంచి స్పీడ్ మీదున్న సమయంలో అవుట్ అయ్యాడు.

తర్వాత ఓవర్ లో ప్రమాదకరంగా మారుతున్న మార్కస్ స్టోయినిస్ ని ముఖేష్ కుమార్ అవుట్ చేశాడు. తను కేవలం 25 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత అందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్లారు. అబోట్ (1), నాథన్ ఎలిస్ (1), ఆడమ్ జంపా (1) టపటపా పడిపోయారు.

కానీ కెప్టెన్ మాథ్యూ వేడ్ మాత్రం వికెట్లకు అడ్డంగా నిలబడి ఆడాడు. 4 సిక్స్ లు, ఒక ఫోర్ సాయంతో కేవలం 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు. బాల్ తో దెబ్బలు తింటూనే ఆ స్కోర్ చేయడమే కాదు.. నాటౌట్ గా కూడా ఉండి పోయాడు. చివరికి 44 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.

ఇండియా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, రవి బిష్ణోయ్ 3, అర్షదీప్ సింగ్ 1, అక్షర్ పటేల్ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్టు తీసుకున్నారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంతో నిలిచింది. మరొక్క విజయం సాధిస్తే సిరీస్ మనదే అవుతుంది. మూడో టీ 20 మ్యాచ్ నవంబర్ 28న గువాహటి వేదికగా జరగనుంది.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×