EPAPER

IND vs AFG : అఫ్గాన్‍పై భారత్ గ్రాండ్ విక్టరీ.. రోహిత్ రికార్డుల మోత

IND vs AFG : అఫ్గాన్‍పై భారత్ గ్రాండ్ విక్టరీ.. రోహిత్ రికార్డుల మోత

IND vs AFG : ఢిల్లీ వేదికగా జరిగిన భారత్ ,ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ విజృంభించి ఆడడంతో భారత్ 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ తన రికార్డ్ బ్రేకింగ్ సెంచరీని సాధించాడు. తొలిత టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తరఫున హస్మతుల్లా షాహిదీ 80 పరుగులు, యువ అజ్మతుల్లా ఒమరాజాయ్ 62 పరుగులు చేయడం తో నిర్ణీత 50 ఒవర్లలో 272 పరుగులు చేసింది.


అరుణ్ జెట్లీ స్టేడియం అనుకున్నట్లే మ్యాచ్లో తన పిచ్ ఫార్మాట్ పూర్తిగా డిఫరెంట్ గా చూపించింది . ఈ పిచ్చి పై జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ తిరిగి చూపించి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక టీమ్ ఇండియా బ్యాటింగ్ మొదలుపెట్టిన తర్వాత మొదటి పది ఓవర్లు రోహిత్ విజృంభించడంతో స్కోరుబోర్డు పరిగెత్తింది .మొన్న జరిగిన మ్యాచ్ లో డక్ అవుట్ అయిన కారణంగా తీవ్ర విమర్శలకు గురి అయిన రోహిత్ తన పూర్వ ఫామ్ లో స్ట్రైక్స్ మీద స్ట్రైక్స్ కొడుతూ బంతిని బౌండరీ వైపు పరుగులు పెట్టించాడు. దీంతో అభిమానులు అందరూ హిట్ మాన్ ఇస్ బ్యాక్ అని పండుగ చేసుకున్నారు. మరోపక్క ఇషాన్ కిషన్ కూడా ఈసారి కాస్త కష్టపడి పరువు నిలబెట్టుకున్నాడు. 47 బాల్స్ ఎదుర్కొన్న ఇషాన్ 47 పరుగులు సాధించాడు .ఒక్క మూడు పరుగులలో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు.

మరీ ముఖ్యంగా 63 బంతుల్లో రోహిత్ చేసిన సెంచరీ మైండ్ బ్లోయింగ్. అంతేకాదు 63 బంతుల్లో రోహిత్ శర్మ చేసిన ఈ సెంచరీ ఇప్పటివరకు ప్రపంచ కప్ లో భారతీయులు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా ఈ టోర్నీ లో రికార్డును సృష్టించింది. ఇక రోహిత్ 84 బంతుల్లో 131 పరుగులు చేయడంతో ఇండియా సునాయసంగా 35 ఓవర్లకే లక్ష్యాన్ని పూర్తి చేయగలిగింది. మొత్తానికి వరుసగా రెండవ మ్యాచ్ లలో కూడా టీం ఇండియా విజయ ఢంకా మోగించింది. ఇక తర్వాత ఇండియా ఆడబోయే మూడవ మ్యాచ్ దాయాది పాకిస్తాన్ టీమ్ తోనే. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తోంది.


అయితే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా మరొక రికార్డును బద్దలు కొట్టాడు. అది కూడా సామాన్యమైన రికార్డు కాదు ఏకంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు పైన ఉన్న రికార్డును కోహ్లీ ఈరోజు మ్యాచ్ లో అధిగమించాడు. వన్డే, టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను తన 53వ ఇన్నింగ్స్ లో కోహ్లీ అధిగమించడం జరిగింది. వీటితో పాటుగా రోహిత్ శర్మ ఈరోజు తాను చేసిన 131 పరుగుల ఖాతాతో మూడు రికార్డులను బద్దలు కొట్టాడు. ఫాస్టెస్ట్ సెంచురీస్ చేసిన క్రికెటర్ గానే కాకుండా ఐసీసీ ప్రపంచ కప్ లో ఎక్కువ సెంచరీలు చేసిన క్రికెటర్ గా…ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లలో ఎక్కువ సిక్సెస్ సాధించిన క్రికెటర్ గా కూడా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రేపు దయాధులతో జరగబోయే పోరులో కూడా ఇండియన్ టీం ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్ మరింత రంజుగా ఉంటుంది.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×