EPAPER

IND Vs SA Second Test : బద్దలైన రికార్డులు.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

IND Vs SA Second Test : బద్దలైన రికార్డులు.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

IND Vs SA Second Test : సౌతాఫ్రికా-టీమిండియా మధ్య జరిగిన రెండో టెస్ట్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి. క్రికెటర్లు వ్యక్తిగతంగా  రికార్డులు సాధించడమే కాదు, మ్యాచ్ పరంగా కూడా రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి.


ముఖ్యంగా టెస్టు క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా చూస్తే అత్యంత వేగంగా ముగిసిన మ్యాచుగా రికార్డు బద్దలు కొట్టింది.  642 బంతుల్లోనే మ్యాచ్ పూర్తయి 92 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కేవలం నాలుగున్నర సెషన్‌లలోనే ముగిసింది.  1932లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌ 656 బంతుల్లోనే ముగిసిపోయింది. ఆ తర్వాత మళ్లీ 92 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు 2024లో భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ 642 బంతుల్లోనే ముగిసి రికార్డ్ స్రష్టించింది.


1935లో వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచు 672 బంతుల్లోనే ముగిసింది.

1888లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 788 బంతుల్లో ముగిసింది.

1888 లోనే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ సైతం 792 బంతుల్లోనే ముగిసిపోయింది.

1889 లో సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కేప్ టౌన్ లో ఇదే వేదికపై జరిగిన మ్యాచ్ 796 బంతుల్లో క్లోజ్ అయ్యింది.

1912లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఓవల్ లో రిగిన మ్యాచ్  815 బంతుల్లో అయిపోయింది.

2021లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ 842 బంతుల్లో ముగిసిపోయింది.

మొత్తానికి రెండో టెస్టు ఒకటిన్నర రోజుల్లోనే ఫలితం తేలిపోయింది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్తా.. ఐదు సెషన్‌ల టెస్టుగా మారిపోయింది.

కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచు గెలిచిన తొలి ఏషియన్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్  ధోనీ తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ డ్రా చేసుకున్న కెప్టెన్‌గా నిలిచాడు.

 మార్ క్రమ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో భారత్‌పై వేగవంతమైన సెంచరీ సాధించిన రెండో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
2010లో సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 75 బంతుల్లో టీమిండియాపై శతకం సాధించాడు.

టెస్టుల్లో ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా తరపున ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆరో ప్లేయర్ మార్క్‌రమ్ రికార్డు నెలకొల్పాడు.
 అనంతరం మార్ క్రమ్ సెంచరీని.. చివరి టెస్టు ఆడుతున్న సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు అంకితం ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌తో డీన్ ఎల్గర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. సౌతాఫ్రికా తరఫున 86 టెస్ట్‌లు ఆడి 37.92 సగటుతో  5347 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 23 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన డీన్ ఎల్గర్‌కు భారత ఆటగాళ్లు ఘన వీడ్కోలు అందించారు. తాము అందరూ కలిసి సంతకాలు చేసిన జెర్సీని అందజేశారు. 

.

.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×