EPAPER

Michael Vaughan : రోహిత్ శర్మ కెప్టెన్సీపై.. ఇంగ్లాండ్ మాజీలు గుస్సా..

Michael Vaughan : రోహిత్ శర్మ కెప్టెన్సీపై.. ఇంగ్లాండ్ మాజీలు గుస్సా..
Michael Vaughan

Michael Vaughan comment…(latest cricket news India)


మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోతే, మనోళ్లు అప్పుడప్పుడు ఇంతేలే.. అని అభిమానులు సరిపెట్టుకునేవారు. కానీ సరిగ్గా 28 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అదీకాక స్వదేశంలో 12 ఏళ్లుగా అప్రతిహితంగా సాగిపోతున్న టీమ్ ఇండియా ఇలా వైఫల్యంతో ఇంత భారీ సిరీస్‌ను ప్రారంభించడం సరికాదని అంటున్నారు. దీనిని ఆసరగా తీసుకుని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు తమ నోటికి పనిచెప్పారు.

ఇంగ్లాండ్ జట్టు వన్డే ప్రపంచకప్ 2023లో ఘోరంగా ఓటమిపాలై, ఏడో స్థానంలో నిలిచినప్పుడు, మరి వీరంతా ఏమయ్యారనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీని విమర్శించేవాళ్లు, ఆరోజున  ఫైనల్ వరకు ఒక్క ఓటమి అన్నదే లేకుండా తీసుకెళ్లిన రోహిత్ ని ఎందుకు ప్రశంసించలేదని అంటున్నారు.


ఇదంతా స్టెడ్జింగ్‌లో ఒక కారణమని నెట్టింట దుయ్య బడుతున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ కెప్టెన్సీ సరిగా లేదని వ్యాక్యానించాడు. అంతేకాదు విరాట్ కొహ్లీ అయితే కరెక్టుగా సరిపోయేవాడని, మ్యాచ్ గెలిచేదని అన్నాడు. ఇప్పుడు ఇతనికి తోడు ఇంగ్లాండ్ మరో మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ తోడయ్యాడు. రోహిత్ శర్మ అత్యుత్తమ దశను దాటేశాడని అన్నాడు. తనకి వయోభారం వల్ల 5 రోజులు గ్రౌండ్ లో నిలబడి కెప్టెన్సీ చేయలేకపోతున్నాడని చెప్పాడు. తనిప్పుడు 37కి చేరువయ్యాడని తెలిపాడు.  

ఒక దశలో గ్రౌండ్ లో కెప్టెన్సీని గాలికి వదిలిసినట్టు అనిపించిందని అన్నాడు. బహిరంగంగా తోటి క్రికెటర్లపై అసహనం ప్రదర్శిస్తున్నాడని, ఇది మంచిది కాదని అన్నాడు. ఇంగ్లాండ్ ఎన్నో సువర్ణావకాశాలను టీమ్ ఇండియాకిచ్చినా, ఉపయోగించుకోలేక పోయిందని అన్నాడు. 

ఇది నిజంగా కెప్టెన్ వైఫల్యమేనని తేల్చి చెప్పాడు. జట్టు కూర్పు కూడా సరిగా లేదని, అంతేకాదు మరో ఇద్దరు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారని అన్నాడు. ఫామ్ లో ఉన్న ఇద్దరూ మ్యాచ్ కి దూరం కావడం టీమ్ ఇండియాపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు.

ఇంగ్లాండ్ మాజీల కామెంట్లు చూసిన నెటిజన్లు ఇవన్నీ చూస్తుంటే విశాఖ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ కి సమర్పించేలాగే ఉన్నారని అంటున్నారు. ఇక గిల్, రోహిత్, శ్రేయాస్ అయ్యర్ ఆటని దేవుడి మీద భారం వేసి, టీమ్ మేనేజ్మెంట్, అభిమానులు చూడటం తప్ప మరో గత్యంతరం లేదని కామెంట్ చేస్తున్నారు.

Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×