EPAPER

India men’s, women’s archery teams: పారిస్ ఒలింపిక్స్‌.. బాణం దిగింది, క్వార్టర్స్‌కు చేరిన ఇండియా ఆటగాళ్లు

India men’s, women’s archery teams: పారిస్ ఒలింపిక్స్‌.. బాణం దిగింది, క్వార్టర్స్‌కు చేరిన ఇండియా ఆటగాళ్లు

India men’s, women’s archery teams: పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్‌లో పురుషుల టీమ్ థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. తెలుగ బ్బాయి ధీరజ్ అద్బుతమైన ప్రదర్శన చేశాడు. ఇక మహిళల విభాగం నాలుగో స్థానంలో నిలిచింది. అమ్మాయిల్లో అంకిత భకత్ సత్తా చాటింది.


భారత ఆర్చరీ టీమ్స్ పతకానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నాయి. గురువారం జరిగిన పురుషు ల విభాగంలో ప్రపంచ కాంస్య పతకం విజేత ధీరజ్ అద్బుతమైన ప్రదర్శన చేశాడు. అందరి అంచనాల ను తలకిందులు చేస్తూ 681 పాయింట్లతో నాలుగో స్థానం సాధించాడు.

మొత్తం టీమ్ విభాగంలో 2013 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ విషయంలో కొరియా అగ్రస్థానంలో నిలవగా, సెకండ్ ప్లేస్‌లో ఫ్రాన్స్ జట్టు ఉంది. క్వాలిఫికేషన్స్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.


ALSO READ: సముద్రాన్ని ఈదిన సిరియా శరణార్థి యుస్రా మర్దిని.. పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతుందా?

మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో అకింత భకత్ అత్యుత్తమ ప్రదర్శన చేసి 11వ ప్లేస్‌లో నిలిచింది. మిగతా ఆటగాళ్లు భజన్ కౌర్‌కు 22వ స్థానం, దీపిక 23 స్థానాల్లో నిలిచారు. వీళ్ల ప్రదర్శనతో భారత్ టీమ్ విభాగంలో 1983 పాయింట్లతో సాధించి నాలుగో ప్లేస్‌లో నిలిచింది. దక్షిణ కొరియా అగ్రస్థానం సాధించింది. ఈ లెక్కన కొరియా నుంచి భారత్ ఆటగాళ్లకు గట్టి పోటీ నెలకొంది. వీళ్లపై ఆధిపత్యం సాధిస్తే.. భారత ఆర్చరీ జట్టు పతకం ఖాయమని అంటున్నారు.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×