EPAPER
Kirrak Couples Episode 1

INDIA BEATS PAKISTAN: పాకిస్తాన్ ని…ఓ ఆటాడుకున్న ఇండియా

INDIA BEATS PAKISTAN: పాకిస్తాన్ ని…ఓ ఆటాడుకున్న ఇండియా

INDIA BEATS PAKISTAN: 30 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన భారత్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి భారత్. వరల్డ్ కప్ లో ఇండియా చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ కి సంప్రదాయంగా మారింది. ఇప్పటికి వరుసగా ఏడుసార్లు ఓడిన పాకిస్తాన్…ఈసారి దానిని కొనసాగించి లెక్క ఎనిమిదికి పెంచింది. ఒక దశలో 300పైగా పరుగులు చేస్తుంది…మనవాళ్ల పని అయిపోయింద్రా అని…సగటు అభిమానులంతా అనుకున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫలించింది. సరైన సమయంలో రివ్యూలు తీసుకున్న తీరు సత్ఫలితాలనిచ్చింది. ముఖ్యంగా కులదీప్ యాదవ్ బౌలింగ్ లో రివ్యూ తీసుకోవడంతో సౌద్ షకీల్ అవుట్ అని తేలింది. అదే ఓవర్ చివరి బంతికి ప్రమాదకరమైన ఇఫ్తికర్ అహ్మద్ ను అవుట్ చేసి…మ్యాచ్ ని టర్న్ చేసి ఇండియా వైపు తిప్పేశాడు. తర్వాత రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో 30 ఓవర్లలోనే ఇండియా లక్ష్యాన్ని చేధించింది.


మొదట టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ కి వచ్చిన పాక్ ఓపెనర్లు అబ్దుల్లా, ఇమామ్ లు చాలా జాగ్రత్తగా ఆడారు. వికెట్లను కాపాడుకోడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే 8 ఓవర్ లో అబ్దుల్లా షఫీక్ (20) రూపంలో తొలి వికెట్ పడింది. అతికష్టమ్మీద సిరాజ్ బౌలింగ్ లో ఆ వికెట్టు దక్కింది. తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ వచ్చాడు. అలా ఒకొక్క పరుగు తీస్తూ ఆడుతుండగా 12 ఓవర్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఇమామ్ (32) రూపంలో మరో వికెట్ దక్కింది. అప్పటికి స్కోర్ 72 పరుగులు. బ్రేక్ వచ్చిందనుకున్నారు. కానీ స్టార్ బ్యాట్స్ మెన్ రిజ్వాన్ వచ్చి పీఠమేసుకుని కూర్చున్నట్టు క్రీజులో కూర్చుండిపోయాడు.

జడేజా బౌలింగ్ లో రెండో బంతికే రిజ్వాన్ ఎల్బీడబ్ల్యూ కావల్సినవాడు బతికిపోయాడు. ఇక అక్కడ నుంచి డిఫెన్స్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో బాబర్, రిజ్వాన్ ఇద్దరూ జిడ్డు ఆడుతూ, అవసరమైనప్పుడు ఫోర్లు కొడుతూ రన్ రేట్ 5కి తగ్గకుండా తీసుకువెళ్లారు. ఈ దశలో క్రికెట్ పండితుల ప్రిడిక్షన్ కూడా పాకిస్తాన్ 300 దాటుతుందనే చెప్పారు. అలాగే జరిగితే ఛేజింగ్ లో ఇండియా ఎన్నిసార్లు గెలిచింది..అనే లెక్కలు కూడా మనోళ్లు తీసేశారు. బాబర్, రిజ్వాన్ ఉన్నంతసేపు కామెంటేటర్లతో సహా అందరూ ఇవే లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. ఒక దశలో మ్యాచ్ చాలా బోర్ అనిపించింది. అంత స్లోగా ఇద్దరూ ఆడారు.


ఇక వీరు ప్రమాదకరంగా మారుతున్నారనే దశలో వీరి భాగస్వామ్యానికి సిరాజ్ తెరదించాడు. అద్భుతమైన లెగ్ కట్టర్ తో బాబర్ (50) వికెట్ లేపేశాడు. అప్పటికి 30 ఓవర్లు, 155 స్కోరుతో పాక్ పటిష్టంగా ఉంది. బాబర్ అవుట్ అయిన మూడు ఓవర్ల తర్వాత కులదీప్ యాదవ్ బౌలింగ్ షకీల్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ రివ్యూకి వెళ్లడంతో ఫలితం అనుకూలంగా వచ్చింది. అదే ఓవర్ లో ప్రమాదకర బ్యాట్స్ మెన్ ఇఫ్తికర్ అహ్మద్ ని అవుట్ చేశాడు. ఆ బంతి అద్భుతంగా టర్న్ అయ్యింది. బయటకు వెళుతుందనుకున్న బాల్ అనూహ్యంగా టర్న్ అయి, ఆఫ్ సైడ్ వికెట్ ని లేపేసింది. ఏం జరిగిందో అర్థంకాక పిచ్ దగ్గర తను స్టన్ అయిపోయి ఉండిపోయాడు.
ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడటంతో వార్ వన్ సైడ్ అయిపోయంది.

ఇక్కడే రోహిత్ శర్మ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. వెంటనే బౌలింగ్ కి బూమ్రాని తీసుకొచ్చాడు. అతని ఎత్తుగడ ఫలించింది. 33 ఓవర్ వద్ద ప్రమాదకర రిజ్వాన్ (49) అవుటయ్యాడు. అలా బాబర్ వెళ్లిన దగ్గర నుంచి 36 పరుగులకు మిగిలిన 6 వికెట్లు పాకిస్తాన్ కోల్పోయింది. ఏదో ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉన్నట్టు ఒకరి తర్వాత ఒకరు పెవెలియన్ కి వెళ్లిపోయారు. అలా 191 పరుగుల వద్ద పాక్ ప్రస్థానం ముగిసింది.

తర్వాత ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ ఇద్దరూ ఆత్మవిశ్వాసంతో కనిపించారు. వైరల్ జ్వరంతో రెండు మ్యాచ్ లకి దూరమైన గిల్ నాలుగు ఫోర్లు కొట్టి మంచి దూకుడు మీద కనిపించాడు. కానీ వెంటనే 16 పరుగులకి షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో అవుటయ్యాడు. తర్వాత కింగ్ కొహ్లీ వచ్చాడు. ఛేజింగ్ మ్యాచ్ లంటే సింహంలా గర్జించే కొహ్లీ తను కూడా 16 పరుగుల వద్దే హాసన్ ఆలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికి ఇండియా స్కోర్ 10 ఓవర్లకి 79 పరుగులు.

సెకండ్ డౌన్ గా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు. సింగిల్స్ తీస్తూ రోహిత్ శర్మకి ఎక్కువ అవకాశం ఇచ్చాడు. దానిని రోహిత్ శర్మ అందిపుచ్చుకుని వరల్డ్ కప్ అంటే తన మార్క్ చూపిస్తూ సెంచరీ దిశగా సాగిపోయాడు. షాట్లు కొట్టడమంటే ఇంత ఈజీనా అన్నట్టు ఆడాడు. అసలు కష్టపడకుండా సిక్స్ ల మీద సిక్స్ లు కొట్టాడు. మ్యాచ్ లో ఆరు సిక్సులు, ఆర్ ఫోర్లు కొట్టి 63 బాల్స్ లో 86 పరుగులు చేశాడు. సరిగ్గా 14 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కొంచెం నిరాశగానే పెవిలియన్ చేరాడు. తర్వాత కెఎల్ రాహుల్ తో కలిసి శ్రేయాస్ అయ్యర్ తాపీగా జట్టుని విజయతీరాలకు చేర్చాడు.

దీంతో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి, పాయింట్ల పట్టికలో ఇండియా టాప్ ప్లేస్ లోకి వెళ్లింది. ఇదే ఊపు, ఉత్సాహంతో ముందడుగు వేసి టైటిల్ కూడా అందుకోవాలని 130 కోట్లమంది భారతీయులు ఉద్వేగంతో ఎదురు చూస్తున్నారు.

Related News

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

Big Stories

×