EPAPER
Kirrak Couples Episode 1

India vs South Africa : వార్ వన్ సైడ్.. ఇండియా చేతిలో సౌతాఫ్రికా చిత్తు చిత్తు..

India vs South Africa : వార్ వన్ సైడ్.. ఇండియా చేతిలో సౌతాఫ్రికా చిత్తు చిత్తు..

India vs South Africa : ముందు నుంచి వచ్చినా, వెనుక నుంచి వచ్చినా, ఫస్ట్ బ్యాటింగ్‌కి వచ్చినా, సెకండ్ బ్యాటింగ్‌కి వచ్చినా, ఛేజింగ్‌కి వెళ్లినా, బౌలింగ్‌కి వచ్చినా.. ఇక్కడ వార్ వన్ సైడ్ అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్ కతాలో సౌతాఫ్రికా-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. మళ్లీ అలా ఇలా కాదు.. వరల్డ్ కప్ లో అరవీర భయంకరమైన జట్లను ఎదుర్కొని 350 పైనే స్కోర్లు సాధించిన సౌతాఫ్రికాను ఇండియా బౌలర్లు మట్టి కరిపించారు. 83పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కింగ్ కొహ్లీ 49వ సెంచరీ చేసి సచిన్ రికార్డ్ ని సమం చేశాడు. అశేష భారతావనికి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు.


టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య చేధనకు వచ్చిన సౌతాఫ్రికా భారత్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొన్నటికి మొన్న శ్రీలంకను 55 పరుగులకి ఆలౌట్ చేసిన ఘటన మళ్లీ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. మొత్తానికి సౌతాఫ్రికా గుడ్డిలో మెల్లలా ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది.

ఫస్ట్ బ్యాటింగ్‌కి వచ్చిన ఇండియా ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్ గిల్ కొంచెం జాగ్రత్తగా ఆడాడు. ఎప్పటిలా రోహిత్ శర్మ ఎటాకింగ్ మోడ్‌లోనే ఆడాడు. ఫస్ట్ పోర్ తోనే స్కోర్ స్టార్ట్ చేశాడు. 24 బాల్స్‌లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 40 పరుగులు చేసి రబడ బౌలింగ్ లో అయిపోయాడు. అప్పుడు వచ్చాడు బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీ.


ఎప్పటిలాగే క్రీజ్ లో కుదురుకున్నాక జాగ్రత్తగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ దశలో గిల్ (23) అవుట్ అయ్యాడు. తర్వాత శ్రేయాస్ వచ్చాడు. తనతో కలిసి నెమ్మదిగా ఒకొక్క పరుగు అతికష్టమ్మీద తీస్తూ ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు ఒకొక్క పరుగుతీస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు.

రోహిత్ శర్మ ఉన్నప్పుడు 5.5 ఓవర్లలో 62 పరుగులు వచ్చాయి. తర్వాత గిల్ అవుట్ అయినప్పుడు 10.3 ఓవర్లలో 93 పరుగులతో ఇండియా మీటర్ పరిగెడుతోంది. అలాంటిది కోహ్లీ, శ్రేయాస్ కలిసి మరో పది ఓవర్లలో అంటే 20 ఓవర్లు వచ్చేసరికి కేవలం 31 పరుగులు మాత్రమే చేశారంటే ఎంత నెమ్మదిగా ఆడారో అర్థమవుతోంది. అప్పుడు జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఉంది.

20 నుంచి 30 ఓవర్లు గడిచాయి. 55 పరుగులు వచ్చాయి. అప్పుడు జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 179తో ఉంది. ఈ దశలో గేర్ మార్చిన శ్రేయాస్ 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ సమయానికి 37 ఓవర్లలో ఇండియా 227 పరుగుల వద్ద పటిష్ట స్థితికి చేరింది.

ఒక ఎండ్ లో కోహ్లీ నిలబడి, తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్స్ అండగా జట్టు స్కోరుని పరుగులెత్తించాడు. కేఎల్ రాహుల్ (8) నిరాశ పరిచాడు. సూర్యకుమార్ యాదవ్ (22), రవీంద్ర జడేజా (29 నాటౌట్) మెరుపులతో జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.

ఈలోపు కింగ్ కోహ్లీ తన 49వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సచిన్ రికార్డ్‌కి చేరుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 61 పరుగులు కూడా సింగిల్స్, డబుల్స్ తో సాధించినవే. అలా తన జన్మదినం సందర్భంగా అశేష భారతావనికి మరిచిపోలేని ఆనందానుభూతులను పంచి ఇచ్చాడు. ఇంతమంది అభిమానుల సంతోషం కన్నా మించింది, మరొకటి లేదని ఈ సందర్భంగా కోహ్లీ అన్నాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, మార్కో జాన్సన్, రబడ, కేశవ్ మహరాజ్, షంషీ తలా ఒకొక్క వికెట్టు తీశారు. 326 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ డికాక్ (5) ఆదిలోనే అవుట్ అయ్యాడు. రెండో ఓవర్‌లో సిరాజ్‌కి దొరికిపోయాడు. అతనే జట్టుకి వెన్నుముక అన్న సంగతి అర్థమైపోయింది. తను వెళ్లగానే ఇండియన్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా కుప్పకూలిపోయింది. అంతా క్యూ కట్టారు.

వీరిలో బౌలర్ మార్కో జాన్సన్ 14 పరుగులే టాప్ స్కోర్. డేవిడ్ మిల్లర్ (11), వన్ డర్ డుస్సెన్ (13), మార్ క్రమ్ (9), కెప్టెన్ బవుమా (11), కేశవ్ మహరాజ్ (7), రబడ (6) అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. స్పిన్నర్ రవీంద్ర జడేజా మాయాజాలంలో పడి అంతా వికెట్లు సమర్పించుకున్నారు. తను వరల్డ్ కప్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ (5/33) ఇచ్చాడు.

షమీ ఎప్పటిలా నిప్పులు చెరిగే బాల్స్ తో సౌతాఫ్రికా నడ్డి విరిచాడు. కీలకమైన రెండు వికెట్లు తీశాడు. వీరికి కుల్ దీప్ యాదవ్ తోడయ్యాడు. తను రెండు వికెట్లు తీశాడు. అంతే 83 పరుగుల వద్ద సౌతాఫ్రికా కథని ముగించేశారు. అటు బౌలింగ్ లోనైనా, ఇటు బ్యాటింగ్ లోనైనా ఇండియాని ఎదుర్కోవడం ఇప్పుడు ఏ జట్టుకైనా సవాలేనని అంతా అంటున్నారు. సౌతాఫ్రికాపై గెలిచి ఎనిమిదికి ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాప్ లో నిలిచింది. ఇప్పుడు నాలుగో స్థానంలో ఎవరు ఉంటారో, వారితో సెమీఫైనల్ ఆడనుంది. ఆది న్యూజిలాండ్, పాకిస్తాన్ అన్నది తేలాల్సి ఉంది.  వచ్చే ఆదివారం నెదర్లాండ్ తో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.

Related News

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Big Stories

×