EPAPER

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

India-Bangladesh T20 tickets from today: ఇవాళ్టి నుంచి భారత్-బంగ్లా టీ20 టిక్కెట్లు విక్రయాలు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు. టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం రెండు సిరీస్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే… టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా… టి20 కూడా గెలవాలని… స్కెచ్ వేసింది. బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడో టి20 మ్యాచ్లు జరగనున్నాయి. ఆరో తేదీ నుంచి అంటే రేపటి నుంచి… ఈ టి 20 మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.


Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

అయితే… బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య… మూడవ టి20 మ్యాచ్… శనివారం 12వ తేదీన జరగనుంది. దీంతో హైదరాబాదులో మ్యాచ్ చూడాలని తెలుగు ప్రేక్షకులు చాలా ఆత్రుతగా.. ఎదురుచూస్తున్నారు. అయితే..ఈ తరుణంలోనే హైదరాబాద్‌ లో జరిగే మ్యాచ్‌ పై హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు…కీలక ప్రకటన చేశారు. ఉప్పల్ వేదికగా ఈ నెల 12న అంటే సరిగ్గా దసరా రోజున భారత్ – బంగ్లాదేశ్ ౩వ T20 మ్యాచ్ జరగనుందని తెలిపారు. ఇక ఈ మ్యాచ్ టికెట్లు శనివారం.. అంటే నేడు మధ్యాహ్నం 12:30 నిమిషాల నుంచి పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్ /అప్ లో విక్రయం ప్రారంభం కానున్నట్లు తెలిపారు హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.


Also Read:  Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750, గరిష్ఠ ధర రూ.15 వేలు ఉంటుందని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ నెల 8 నుంచి 12 తేదీ వరకు, జింఖానా స్టేడియంలో ఆన్ లైన్ లో బుక్ చేసిన టిక్కెట్లను రిడంషన్ చేసుకోవాలని కూడా కోరారు హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు. ⁠Redemption కోసం 11AM to 7PM, ప్రభుత్వ గుర్తింపు గల ఏదైనా ఐడి కార్డు, ఆన్ లైన్ బుకింగ్ ప్రింట్ చూపించి టిక్కెట్లు తీసుకోవచ్చు అంటూ ప్రకటన చేశారు. ఆఫ్ లైన్ కౌంటర్లలో టిక్కెట్లు విక్రయించడం లేదన్నారు హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.

Related News

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Big Stories

×