EPAPER

Rohit Sharma Create History: రోహిత్ శర్మ మరో చరిత్ర.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Rohit Sharma Create History: రోహిత్ శర్మ మరో చరిత్ర.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Rohit Sharma Surpasses Sachin Record(Cricket news today telugu): క్రికెట్ లో రికార్డులు రావాలంటే సచిన్ తర్వాత ఎక్కువగా విరాట్ కొహ్లీకి వస్తుంటాయి. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల కోసం ఎప్పుడూ ఆడడు. కానీ అవి మాత్రం తన వెన్నంటే వస్తుంటాయి. మొన్ననే సిక్సర్ల రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ నేడు మరో రికార్డు సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించాడు.


అదేమిటంటే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఇంతవరకు భారత ఓపెనర్ గా తను 121 హాఫ్ సెంచరీలు చేసి నెంబర్ వన్ అయ్యాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ (120) రికార్డుని అధిగమించాడు.

2023 జనవరి నుంచి ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లో అత్యధిక సిక్స్‌లు (53) కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (4) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తనకన్నా ముందు ఫస్ట్ ప్లేస్ లో వీరేంద్ర సెహ్వాగ్ (7) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత సచిన్, రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ ఒకొక్క హాఫ్ సెంచరీతో ఉన్నారు.

Also Read: ఒలింపిక్స్.. భారత హాకీ జట్టుకు ఊహించని షాక్, అమిత్‌పై ఒక మ్యాచ్ నిషేధం

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (18,426) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(13,886), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889).. రోహిత్ శర్మ (10,831) ఇలా వరుసగా ఉన్నారు.

వన్డే క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి అత్యధిక యావరేజ్ (74.90) కలిగిన జోడీగా రోహిత్.. రికార్డ్ సాధించాడు.

Related News

Indian opener Yashasvi Jaiswal: ప్యూచర్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ అతడే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Big Stories

×