EPAPER

IND Vs PAK : టీ20 వరల్డ్ కప్ లో భారత్ మహిళల జోరు.. తొలి మ్యాచ్ లో పాక్ పై ఘన విజయం..

IND Vs PAK : టీ20 వరల్డ్ కప్ లో భారత్ మహిళల జోరు.. తొలి మ్యాచ్ లో పాక్ పై ఘన విజయం..

IND Vs PAK : మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయం సాధించింది. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భాతత్ కు ఓపెనర్లు యాస్తికా బాటియా , షఫాలీ వర్మ మంచి ఆరంభాన్ని అందించారు. జట్టు స్కోర్ 38 పరుగులు వద్ద బాటియా ( 17) పెవిలియన్ బాట పట్టింది. అయితే జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి షఫాలీ (33) స్కోర్ పెంచే ప్రయత్నం చేసింది. భారత్ స్కోర్ 65 పరుగుల వద్ద షఫాలీ వెనుదిరిగింది. ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (16) అవుట్ అయ్యింది. దీంతో మ్యాచ్ లో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి భారత్ 39 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. కానీ రోడ్రిగ్స్ ( 8 ఫోర్లతో 53 నాటౌట్) , రిచా ఘోష్ ( 5 ఫోర్లతో 31 నాటౌట్) దాటికి ఆడుతూ భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోడ్రిగ్స్ కు ఫ్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.


అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ జట్టులో బిస్మా మరూఫ్ అద్భుతంగా ఆడి 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఒక దశలో 12.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేసింది పాక్. కానీ ఆ తర్వాత మరూఫ్ కు ఆయేషా నషీమ్ (2 ఫోర్లు, 2 సిక్సులతో 43) జత కలిసింది. ఇద్దరూ చివరి వరకు క్రీజులో నిలబడి దాటిగా ఆడుతూ పాక్ కు భారీ స్కోర్ అందించారు .

భారత్ బౌలర్లలో రాధికా యాదవ్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లు పడగొట్టింది. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. మిగతా భారత్ బౌలర్ల ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాకిస్థాన్ మంచి స్కోర్ సాధించింది.


Tags

Related News

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Shardul Thakur: 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్..నువ్వు రియల్‌ హీరో శార్దూల్‌!

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

IPL 2025: కోహ్లీకి ఎసరు..RCB లోకి టీమిండియా కెప్టెన్‌ ?

Big Stories

×