BigTV English

IND vs NZ: ఉప్పల్ వన్డే మనదే.. కివిస్ పై గెలుపు.. లాస్ట్ వరకూ టెన్షన్.. గిల్ డబుల్ జిల్

IND vs NZ: ఉప్పల్ వన్డే మనదే.. కివిస్ పై గెలుపు.. లాస్ట్ వరకూ టెన్షన్.. గిల్ డబుల్ జిల్

IND vs NZ: ఉప్పల్ వన్డేలో న్యూజిలాండ్‌ పై టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివిస్ 337 రన్స్ కు ఆలౌట్ అయింది. మైఖేల్ బ్రాస్ వెల్ (140) చెలరేగి ఆడటంతో లాస్ట్ వరకూ మ్యాచ్ టెన్షన్ గా సాగింది. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు.. మహ్మద్ షమి, హార్ధిక్ పాండ్యా చెరొక వికెట్ పడగొట్టారు.


అంతకుముందు, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసి న్యూజిలాండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3), కుల్దీప్ యాదవ్ (5), షమి (2) పరుగులు చేశారు.

శుభ్‌మన్‌గిల్ 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశారు.


19వ వన్డే ఆడుతున్న గిల్.. కెరీర్ లో వెయ్యి పరుగుల మైలురాయిని దాటేశాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ 24 వన్డేల్లో వెయ్యి రన్స్ చేయగా.. గిల్ 19 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×