IND vs NZ 3rd Test: మూడో టెస్టులో టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే రెండు టెస్టులు ఓడిపోయిన టీమ్ ఇండియా… మూడో టెస్టులో కూడా చేతులెత్తేసింది. 147 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక విఫలమైంది రోహిత్ సేన. ఈ తరుణంలోనే… న్యూజిలాండ్ చేతిలో 25 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ లో 29.1 ఓవర్లు ఆడిన టీమిండియా… 121 పరుగులకు కుప్పకూలింది. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ రాణించకపోవడంతో… మూడో టెస్టులో ఓటమిపాలైంది.
ఇక ఈ సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది న్యూజిలాండ్ జట్టు. చాలా ఏళ్ల తర్వాత.. సిరీస్ కోల్పోవడమే కాకుండా… మ్యాచ్లన్నీ ఓడిపోవడం టీమిండియా కు ఘోర అవమానమని చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా చేతిలో…2-0 తేడాతో టీమిండియా అచ్చం ఇలాగే సిరీస్ కోల్పోయింది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్ ఇదే !
రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 60 కి పైగా పరుగులు చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు ఎవరు రాణించలేదు. ఈ మ్యాచ్లో 64 పరుగుల వద్ద… రిషబ్ పంత్… అవుట్ అయ్యాడు.అ యితే రిషబ్ పంత్ వికెట్ వివాదాస్పదంగా మారింది. అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా.. రిషబ్ పంత్ వైదొలగాల్సి వచ్చింది.
ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అటు టీమిండియా విషయానికి వస్తే… మొదటి ఇన్నింగ్స్ లో… 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగులకు ఆలవుటై ఘోరంగా ఓడిపోయింది.
అయితే టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి.
టీమిడియా ఓటమికి కారణాలు
టీమిండియా ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం టాస్ ఓడిపోవడం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పట్టర్ ఫ్లాప్ అయింది. ఇందులో ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రెండు ఇన్నింగ్స్ లలో దారుణంగా విఫలమయ్యారు. అదే సమయంలో… మొదటి రెండు టెస్టుల్లో బాగా ఆడిన యశస్వి జైష్వాల్… మూడో టెస్ట్ లో పెద్దగా రాణించలేదు.
ఇక… మొదటి రెండు మ్యాచ్ల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్..మూడో టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన ఆయన… రెండో ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యాడు. ఇక ఆల్రౌండర్లలో… రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ ఈ ముగ్గురు… రెండో ఇన్నింగ్స్ లో కాస్త వికెట్ కాపాడుకొని… మ్యాచ్ గెలిపిస్తే సీన్ వేరుగా ఉండేది.