EPAPER

IND vs ENG Fourth Test: ముగిసిన తొలిరోజు ఆట.. రూట్ సెంచరీ.. ఇంగ్లాండ్ 302/7..

IND vs ENG Fourth Test: ముగిసిన తొలిరోజు ఆట.. రూట్ సెంచరీ.. ఇంగ్లాండ్ 302/7..
live sports news

IND vs ENG Fourth Test Updates: రాంచీ వేదికగా ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ సెంచరీ సాధించాడు. క్రీజులో రూట్ ( 106*), రాబిన్సన్ (31*) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్‌తో అరంగ్రేటం చేసిన ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. 47 పరుగుల వద్ద బెన్ డకెట్ (11) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో ఓలీ పోప్‌(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన ఓపెనర్ జాక్ క్రాలీ(42, 42 బంతుల్లో)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.

Read More: ఇంగ్లాండుపై అశ్విన్ వంద వికెట్ల పండుగ.. తొలి భారత బౌలర్ గా రికార్డ్!


57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్, బెయిర్ స్టో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ బెయిర్ స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ వెంటనే కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జడేజా ఎల్బీగా అవుట్ చేశాడు. 112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్, కీపర్ ఫోక్స్ ఆదుకున్నారు. టీ తర్వాత ఫోక్స్(47) సిరాజ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టామ్ హార్ట్లీ(13)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు.

భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×